చదువు నేర్పే గురువు మీరు ... -ఆముక్త సముద్రాల

చదువు నేర్పే గురువు మీరు ... -ఆముక్త సముద్రాల

అమ్మ పాడే జోల పాట మాదిరి...
చదువు నేర్పే గురువు మీరు 
దారి చూపే వెలుగు మీరు 
మాకు... చదువు నేర్పే గురువు మీరు
మమ్ము తీర్చిదిద్దే శిల్పి మీరు 
క్లాసులో పాఠం బోధించి 
ఓర్పుతో నడతను నేర్పించి 
భావి భారత పౌరుల జేసే బాధ్యత మీదేగా 
మీరు లేక సమాజం ఉనికిని కోల్పోదా..
      ll చదువు నేర్పే ll 
ఓనమాలనే నేర్పించి ఓరిమి చూపించి 
తప్పు ఒప్పులను సవరిస్తూ ముందుకు నడిపించి. ll 2ll
ఉన్నత శిఖరం మము చేర్చి సంతోషించగలరు  
సొంతకాళ్లపై నిలిచేలా తీర్చిదిద్దగలరు 
మార్బుకు మూలం గురువేగా....
ఓఓ....
మార్పుకు మూలం గురువేగా 
నడిపేవెలగు ఇక గురువేగా...
    ll చదువు నేర్పే ll

-ఆముక్త సముద్రాల 
పిజిటి తెలుగు 
వంగర, హనుమకొండ

0/Post a Comment/Comments