Pravahini



_*ఢీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు దృష్టి పెట్టాలి*_ 

 *ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్.* 

        భవిష్యత్తులో డీలిమిటేషన్ ద్వారా అనేక మార్పులు దక్షిణాది రాష్ట్రాలు ఎదుర్కొంటాయని  ప్రముఖ సాహితీవేత్త  డా.చిటికెన కిరణ్ కుమార్ అన్నారు.
          భారతదేశ జనగణన ఆధారితంగా డీలిమిటేషన్ ( నియోజకవర్గాల పునఃర్విభజన ) జరుగుతున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సందర్భంగా పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, ఇంటర్నేషనల్  బెనెవోలెంట్ రీసర్చ్ ఫోరం సభ్యుడు,  ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో  జనాభా ప్రాతిపదికన ప్రధానంగా నిర్ణయించే ఈ విభజన విషయంలో అత్యధిక జనాభా ఉత్తర భారత దేశంలో గల రాష్ట్రాలలో కల్గిన కారణంగా గతంలో కంటే నేడు అనేక మార్పులు జరుగుతాయన్నారు. సాధారణంగా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు సంఖ్య ఆధారితంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కేటాయింపులు జరుగుతాయిని చెప్పవచ్చన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో తక్కువ జనాభా పెరుగుదల కారణంగా పది శాతం మాత్రమే ఎమ్మెల్యే, ఎంపీ నియోజకవర్గాల స్థానాలు పెరిగే అవకాశం ఉన్నాయని. దక్షిణ భారతదేశంలో కంటే తొంబయి శాతం అధికంగా ఉత్తర భారత దేశంలో నియోజకవర్గ స్థానాలు పెరుగుతున్నాయన్నారు. ఈ విధంగా డీలిమిటేషన్ ద్వారా కేంద్ర  ప్రభుత్వ నిధులు, నియామకాల విషయంలో గతంలో కంటే ప్రస్తుతం అనేక మార్పులు జరిగే సూచన వ్యక్తం అవుతున్న సందర్భంగా దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక ప్రణాళికా బద్ధమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

0/Post a Comment/Comments