రంజాన్ పండుగ ప్రాముఖ్యత
పీత్రా పరమార్ధం గురించి వివరించిన కవి,లెక్చరర్ ఉమాశేషారావుచాలామందికి తెలియని విష యం 'రమదాన్' అనేది ఒక నె ల చాలామంది రంజాన్ అని అంటారు కానీ రమదాన్ అని పిలవాలి పవిత్రగంధం ఖురాన్ అవతరించింది ఈ నెలలోనే రమదాన్ పండుగకు మరో పే రు ఈద్ ఉల్ పిత్ర ఈ నెలలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉప వా సాలు పిత్రా జకాత్ దానధ ర్మా లు చేస్తుంటారు పండగలు మ న జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు సంస్కృతి వికాసానికి దోహదం చేస్తూనే ఉంటాయి. పండుగ అనేది ఏ మతానికి సంబంధించినదైన సరే దాని వెనుక ఒక సందేశం దాగి ఉంది పండగ మానవాళికి హితన్ని బోధిస్తుంది ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపు కు నే రమదాన్ పండుగ సైతంమాన వాళికి హితాన్ని అందిస్తుందిముస్లింలుచంద్రమానక్యాలెండర్ అనుసరిస్తా రు చంద్రమానాన్ని అనుసరిం చేఇస్లామీయక్యా లెండర్ 9వ నెల రమదాన్ దీన్ని ముస్లింలు అత్యంత పవిత్ర మైనదిగా భావి స్తారుదానికిప్రధా నమైన కారణం దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భ వించ డమే క్రమశిక్షణ, దాతృ త్వం, ధార్మిక చింతనల కల యికే రంజాన్ మాసం ఖురాన్ ప్రకార ము రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ఉపవాసం. ఉపవాసాన్ని పారశి భాషలో రోజా అని అం టారు.సౌమ్ అని అరబ్బీ లో పిలుస్తారు ఈ ఉపవాస వీధిని గురించి దివ్య ఖురాన్ గ్రంథం వివరిస్తుంది. విశ్వాసులారా గత దైవ ప్రవక్తలను అనుసరిం చే వారికి ఎలా ఉపవాసాలు విధిగా నిర్ణయిం చబడ్డాయో అలాగే మీలో భయ భక్తులు జనించ డానికి అదేవిధంగా ఇప్పుడు మీకు కూడా ఉప వాసాలు నిర్ణయించబడ్డాయి. ఈ మా సంలో ఆచరించే సత్కా ర్యాల లో పిత్రా ఒక్కటి. పిత్రా అన్న పదం ఇఫ్తార్ నుండి వచ్చింది. అంటే శాబ్దిక అర్థం ఉపవాస విరమణ అన్నమాట. సదఖ యే ఫిత్రు అంటే రోజా విరమ ణకు సంబంధించిన దానము అని అర్థం.ధర్మశాస్త్ర పరిభాష లో సదాకాయే ఫిత్రు అంటే ఉపవాస దీక్షలు పాటించే టప్పుడుజరిగినలోపాలకు పొరపాట్లకు పరిహారంగా రమదాన్ నెలలో విధిగా చెల్లిం చవలసిన దానమన్నమాట. రోజాలు విధిగా నిర్ణయించిన నాటి నుండే పిత్రాలు కూడా తప్ప నిసరిగా చెల్లించాలని మమ్మద్ ప్రవక్త ఆదేశించారు. ఆ కాలంలో ప్రజలు ముఖ్య ఆహారంగా విని యోగించే పదార్థాలనే పరిగణ లోకి తీసుకొని పిత్రాలు చెల్లించే వారు హజ్రత్ అబూ సయ్యద్ కుత్రి ఇలా చెప్పారు ప్రవక్త వారి కాలంలో మేము ఈదుల్ పిత్రా లు దానంగా ఒక పరిమా ణమంత పదార్థాలను ఇచ్చే వాళ్లం ఆ కాలంలో యావా లు ,ఎండుద్రాక్ష ,ఖర్జూరం ,జున్ను తదితరాలు ముఖ్య ఆహార పదార్థాలు గా ఉండేవి ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే వారందరి తరపున కుటుంబ యజమాని పిత్రా చెల్లించాలి. పండుగ నమజ్ కంటే ముందు జన్మించిన శిశు వు తరపున కూడా తల్లిదండ్రు లు పిత్రా చెల్లించాలి పండుగ కంటే ముందే ఈబాధ్యత నెర వేర్చుకోవాలి .సా అంటే పావు తక్కువ రెండు షేర్లు,మరీనా కాలాన్ని బట్టి కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.కనీసం ఈద్ నమాజ్ కు వెళ్ళు వెళ్లే ముందు అయినా చెల్లించాలి. మూడు నాలుగు రోజులు ముందు చెల్లి స్తే లబ్ధిదారుల పండుగ సామాగ్రిని కొనుక్కో వడానికి వీలుగా ఉంటుంది. పండుగ సంతోషంలో అంద రినీ భాగస్వాములను చేయడ మే దీని యొక్క ముఖ్యఉద్దేశం ఈ నెలలో మరోముఖ్య మైన విషయం జకత్ దీనిని పేదల ఆర్థిక హక్కుగా పేర్కొంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో తన సంప ద నుండి 30 శాతం చొప్పున ధన, వస్తు కానుకల రూపంలో పేదలకు ఇస్తారు పేదవారు కూ డా సంతోషంగా పండుగ జరు పుకోవడానికి ఇది వీలు కల్పి స్తుంది. ఈ మాసంలో మరొక ప్ర త్యేకత శవ్వాల్ నెల వంక ప్రత్యక్షమైన తర్వాత ఉపవాస వ్రతా న్ని విరమించి మరుసటి రోజు ఈదుల్ పిత్తర్ పండు గను జరుపుకుంటారు శవ్వాల్ ను ఎలా మొదటి రోజున జరు పుకునే పండుగను ఈదుల్ ఫిత్తర్ అంటారు. రంజాన్ మాసంపుణ్యకార్యాల వైపు దృష్టి మరచి చైతన్యాన్ని కలి గించి ముందుకు సాగే ధైర్యా న్నిస్తుంది. ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి పండుగ నమా జును ఊరి బయట నిర్ణీత ప్రదే శాలైనఈద్గాలలోచేస్తారు.అనం తరం ఒకరికొకరు ఈద్ ముబా రక్ చెప్పు కుంటారు ఈ నెలలో జరిగే ఇఫ్తార్ విందు హిందూ ముస్లింల ఆత్మీయ తకు నిద ర్శనం మహ్మద్ ప్రవక్త ఆశీస్సు లతో మనిషి సత్ప్ర వర్తన దిశ లో సాగడానికి ఈ నెల ఎంతో తోడ్పడుతుంది.అంత సృష్టి కర్తకే చెందుతుంది.సుఖర్మ చేయడమే మనిషి విధి అని ఖురాన్ చెపుతుంది.
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్