పోతున్న కరెంటు !

పోతున్న కరెంటు !

పోతున్న కరెంటు !
    (((((++++)))))))))

కరంటు కరంటు కరంటు
పట్టు తప్పుతున్న కరెంటు
బెట్టు చేస్తున్నది ఈ కరెంటు
గుట్టు చప్పుడు లేని కరెంటు !

కరంటు కరంటు కరంటు
కాలిపోతున్నది  కరెంటు
తేలిపోతున్నది కరెంటు
తేలిపోతున్నది కరెంటు !

కరంటు కరంటు మన కరంటు
చెప్పకుండా పోతుంది కరెంటు
చెప్పకుండానే వస్తుంది కరెంటు
దోబూచులాడేటి మన కరెంటు !

ట్రాన్స్ఫారాలను పేల్చే కరెంటు
మీటర్లను కాల్చేటి ఈ  కరెంటు
ఎప్పుడొస్తదో ఎప్పుడు పోతదో
మనం రెంటు కట్టేటి ఈ కరెంటు !

కరంటు కరంటు  కరంటు
24 గంటల మన  కరెంటు
జబ్బు పడి రాని  కరెంటు
మబ్బు చెలిమి ఈ కరెంటు !

కరంటు కరంటు కరంటు
పలాయనమైన కరెంటు
వాలాయనమైన కరెంటు
సమరంలో ఓడిన బంటు !

కరంటు కరంటు కరంటు
కాకావికలైన ఈ కరెంటు
సకాలంలో రాని కరెంటు
సాగదీయు కాలం కరెంటు !

కరంటు కరంటు కరంటు
కలిమినిస్తుంది ఈ కరెంటు
బలిమిని మేస్తుంది కరెంటు
వస్తూ పోయే మన కరెంటు !

కరంటు కరంటు ఈ కరంటు
ఉన్నోళ్లందరికీ ఉట్ల పండుగను
చేస్తూ వారితోనే  కలిసుంటది
లేనోళ్లందరికీ లొట్ల పండుగను
 తాను చేస్తూ వెలివేస్తుంటది  

కరెంటు కరెంటు  కరెంటు
దారి తప్పుతున్న కరెంటు
బేజారు చేస్తున్న కరెంటు
 దిగజారుతున్న కరెంటు !

కనురెప్ప తెరిచినంతనే పోతుంది
కనురెప్ప మూసినంతనే వస్తుంది
దాగుడుమూతలు తాఆడుతుంది
 దగా చేసి మనలను దండిస్తుంది !

కరెంటు కరెంటు ఈ కరెంట్
ఉండదు ఎప్పుడు పర్మినెంట్
నిదురొచ్చి అది ఇక పడకేస్తది
మనలను దోమలతో కరిపిస్తది !

నిదురరాక అటు ఇటు దొర్లుతాం
ఆ కరెంటు ఉద్యోగులపై ఒర్లుతాం
ఎన్ని ఫోన్లు చేసిన జవాబు నిల్
చివరకు అవుతావులే నీవే ఫూల్ !

ఇదండీ నడుస్తున్న మన కరెంటు కథ
 ఉండదా వినియోగదారులకు ఇక వ్యధ
ఎప్పుడు తప్పుతాయో మన బాధలు
ఇందెప్పుడు చూస్తామో విజయ గాధలు !

(గౌతమ్ గారి కవితకు మరో రూపం నా కవిత)
గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments