పరీక్షలంటే చాలు భయమొ చ్చేస్తుందే ( పేరడీ గేయం) :
(గోదారి గట్టు మీద రామచిలకవే పాట మాదిరి...)
పల్లవి:
పరీక్షలంటే చాలు భయమొ చ్చేస్తుందే
ఇన్నాళ్లు చదివినదంతా గురుతే రానందే. ।।2।।
సంవత్సరం మొదలవగానే సంబర మేసిందే
ఆటలతో ప్రోగ్రామ్ ల్తో ముగిసేపోతుందే
టీచర్లు చెప్పిందంతా విన్నట్టేవుందే
చక్కంగా చదివేసి ర్యాంకులతో ముందుకు పోవాలే
।। పరీక్షలంటే చాలు....।।
చరణం 1:
లెక్కల బుక్కేమో రమ్మని పిలిచిందే
ఎక్సరసైజు చూడంగానే ఏది రానందే
ఫార్ములాలన్నీ కూడా మళ్లీ చదవాలే
ప్రాబ్లమ్స్ చెప్పగానే ప్రాక్టీస్ చేయాలే
ఫిజిక్స్ బుక్కేమో పిలుపే ఇచ్చిందే
కాన్కెవ్ మిర్రర్ కాన్వేక్స్ మిర్రర్ భేదం చెప్పమందే
గ్రావిటేషన్ పవర్ను గుర్తుపట్టాలే
కెమిస్ట్రీ సబ్జెక్టు అమ్మో దానికి దండాలు
ఈక్వేషన్స్ సొల్యూషన్స్ చేస్తూ పోవాలె
అన్నుంటాయి సబ్జెక్టులు అన్నీ చదువుతూ పోవాలి
నచ్చింది చదివేస్తూ భవిష్యత్తులో ఎదుగుతూ సాగాలె
।। పరీక్షలంటే ।।
చరణం2:
కాలేజ్ అనగానే కంగారేసిందే
ఐఐటీలు, జేఈఈలు చదివేమన్నారే
నీట్ ఎగ్జామ్స్ మనము అటెంప్ట్ చేయాలే
ఎంబీబీఎస్ లో ర్యాంకులు కొట్టాలె
టీనేజ్ అంటేనే స్నేహం అంటారే
స్నేహితురాళ్లతో గడిపిన కాలం మళ్ళీ కావాలే
కాసు రూముల్లో కామెంట్ చేయాలే
డార్మెంటరీలో అల్లర్లు డైనింగ్ హాల్లో ముచ్చట్లు
టీచర్లంతా మనకు పెట్టిన
చీవాట్లు
స్టడీఅవరు ఎగ్గొట్టాం క్లాసులు కొన్ని బంకొట్టాం
ఎన్నెన్నో జ్ఞాపకాలతో కాలేజీనీ వీడి వెళతాం
।। పరీక్షలంటే చాలు ।।
- ఆముక్త సముద్రాల
పిజిటి తెలుగు
వంగర, హనుమకొండ