*త్రివేణి సంగమం.. మహాజన సంగమం*
త్రివేణి సంగమం.. మహాజన సంగమం
సకల మానవాళికి శుభకరం
చేకూర్చ.. వచ్చింది కుంభమేళ.
సంరంభం.. అంబరాన్నింటే.
త్రివేణి సంగమ.. పవిత్ర స్నానం.. మూడు మునకల సంబరం.రెండు కనులు చాలవు.. మునుల.. సాధువుల..దివ్య దర్శనం.
నలుదిక్కుల..అలరించే
ఆహ్లాదం.. అఘోరాల ఓంకార
శంఖ నాదాల ప్రతిధ్వని.
పంచభూతాల ఆశీర్వదించే
ఆరుదించే..పుణ్యోత్సవం.. కుంభ మేళా జలక్రీడోత్సవం..
సప్తరుషులుగా దర్శన భాగ్యం సాదుసంతుల.. సమ్మేళనం కుంభమేళా..సంగమం. పుష్కరపుష్కర వత్సర ఆగమనా కుంభ మేళా..కోటాను కోట్ల జనుల స్నానం పూర్వ జన్మ సుకృతం..
మానవ జన్మ కర్మ ఫలం.
కష్టాల కడదేర్చుమా..సుఖ సంతోషా ల నోసుగుమా.. పుష్కర కుంభమేళా
సూర్యగమన నిర్ణయమే,.
ప్రయాగరాజ్ ప్రయాణం...
సకల జనులకు,
శుభః భూయాత్ గా
దీవెనలు ఒసంగుమా..
త్రివేణి సంగమమా!
ముక్కంటి జంగమా.!!
అందుకో మా శతకోటి వందనాలు.
ఈ కవిత.. నా స్వీయ రచన
ఎవరికీ అనుకరణ, అనువాదం కాదని హామీ ఇస్తున్నాను
రచన
ఇమ్మడి రాంబాబు
తొర్రూర్, 9866660531