యోధుడా
తెలంగాణ ఊపిరిగా
శ్వాశగా
ప్రాణాలను లెక్కచెయ్యక
ఆమరణ నిరాహారదీక్ష చేసి
దశాబ్ద కాలం పాటు
పల్లె పల్లె తిరిగి
పట్టణం గడప లో కూడా
నీ మాటల చెమక్కుల తో
తెలంగాణ అవశ్యత ను
అర్థబోధ చేశావు
ఆహార్యం బక్క పలుచున
ఆలోచన అద్భుతం
మలిదశ ఉద్యమ సారధి
లక్ష్యాన్ని ఛేదించన యోధుడా
తెలంగాణ సమాజం
యావత్తు జన్మదిన శుభాకాంక్షలు అందిస్తుంది
తెలంగాణ రాజకీయ
సాంస్కృతిక పోరాటంలో
చెరగని శిలక్షరామ్
వి.ఎస్.రావు
కామారెడ్డి