పత్రికా ప్రకటన
*పాఠశాలల్లో చిటికెన రాసిన గేయం*
తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫోరమ్ సభ్యులు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ రచించిన " ఎగురుతోంది ఎగురుతోంది మువ్వన్నెల జెండా" గేయాన్ని హైదరాబాద్ లోని పలు పాఠశాలలలో బోర్డులపై వ్రాసి, డిజిటల్ స్క్రీన్ లపై ప్రదర్శిస్తూ విద్యార్థులకు ఉపాధ్యాయులు నేర్పుతున్నారు.
ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ దేశభక్తి గేయాలు,సామాజిక ఇతివృత్తంతో మానవీయ కోణంగా గతంలో తన రచనలు అనేకంగా గేయాలు, కథలు,కవితలు, వ్యాసాలు వెలువడినాయన్నారు. తను రచించిన ఓ తండ్రి తీర్పు లఘు చిత్రంనకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు లభించాయన్నారు. "ఎగురుతోంది ఎగురుతోంది మువ్వన్నెల జెండా" అంటూ రాసిన గేయం యూట్యూబ్ ద్వారా వైరల్ అవుతుందని, జెండా యొక్క మూడు రంగుల విశిష్టతను ఒక ప్రత్యేక కోణంలో రచించడమైనదన్నారు. త్యాగదనుల ఫలంగా లభించిన భారత స్వాతంత్రం గురించి తెలుసుకోవలసింది ఎంతైనా ఉన్నదన్నారు. కుల, మత, వర్గ,వర్ణములకు అతీతంగా ఎందరో మంది ఆత్మతర్పణం చేయగా సిద్ధించిన మన స్వాతంత్రాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నదన్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు, మానేరు రచయితల సంఘం డా.పత్తిపాక మోహన్, ఎలగొండ రవి, జిందం అశోక్, బూర దేవానందం, వంశీ, స్తానిక కవులు రచయితలు చిటికెన కిరణ్ కుమార్ కు అభినందనలు తెలిపారు.