గాలిపటం యొక్క పాటం
అది అర్థం చేసుకుంటే ఒక
గుణపాఠం
గాలి వీచినంత సేపు
ఎగురుతూనే ఉంటుంది
తలకిందులు అయిన దారం
ఉన్నంత వరకు సాగుతూనే
ఉంటుంది
మరి యవ్వనం లో
సమయం వృధా చేస్తే ప్రయోజనం
శూన్యం
కెరటం కింద పడి లేస్తూనే
ఉంటుంది
ఒంట్లో సత్తువ ఉన్నంత
సేపు ప్రయతించండి
గాలిపటం వీచికను
గమ్యం లేని జీవితం తో
పోలుస్తారు
గాలి పటం ఎగురడానికి
దారం ఆధారం
నీ ఎదుగుదల కు
తల్లి దండ్రులు ఆధారం
వృద్ధాప్యంలో మరువకు
చరక దారం కు కూర్పు
ఎగరవేసేందుకు
తోడ్పాటు
నైపుణ్యం ప్రదర్శన కు
ఇతరుల పోటీ తో
గాలిపటలను త్రుంచి ఆనంద పడడం
పోటీ ప్రపంచం లో నిన్ను
మించిన వారు ఇంకొక్కరు
ఉన్నారు అని
రంగు రంగుల గాలిపటలు
జీవితం ఒక రంగుల మాయం
మన ఖర్మ మీద మనం
సృష్టించుకొనే
జీవితం
కాలం రెండు యానాల కు
మారడం
నీవు కూడా కాలం తో పరిగెత్తలి
గాలిపటం కు ఎగరెందుకు
హద్దులు లేవు నీ జీవితం
అంత
విద్యార్థి ఆర్తి గా తినే ఆకలి
కాదు జ్ఞానం అనే ఆర్తి తో
ముందుకు సాగుదాం
గాలి పటం ఎగిరేసే ఆనందం
జీవితం లో ఎదిగి నప్పుడే
ఉమాశేషారావు వైద్య
లింగాపూర్
కామారెడ్డి
9440408080