అరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు సమన్వయ కర్తగా కొంపెల్లి రామయ్య
ఖమ్మం జిల్లా: ఖమ్మం రూరల్ జలగం నగర్ ప్రాంత నివాసి మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలం దాట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పని చేస్తున్న ఆంగ్ల ఉపాద్యాయుడు, కవి,రచయిత,విశ్లేషకుడు వికాస వేదిక మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కొంపెల్లి రామయ్య ను ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కేంద్రంలోఈ నెల 28,29 తేదీలలో నిర్వహించబోయే అరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో మూడవ వేదికలో కవి సమ్మేళనం నిర్వహించుటకు సమన్వయ కర్తగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా రామయ్య మాట్లాడుతూ అంతకు ముందు ప్రపంచ రచయితల మహాసభలలో పదహారు వందలకు పైగా కవులు పాల్గొన్న కవిసమ్మేళనంను సమయ స్ఫూర్తి తో నిర్వ హించి నందుకు అధ్యక్ష ప్రధాన కార్య దర్శులు గుత్తికొండ సుబ్బారావు, జి వి పూర్ణచంద్ గార్లు మళ్ళీ ఈ బాధ్యతను నాకు ఒప్ప చెప్పినందుకు నేను వారికీ, కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాను. ఈ సందర్బంగా మా సంస్థ వికాస వేదిక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాధనల వెంకటస్వామి, లెనిన్ శ్రీనివాస్, సంస్థ సభ్యులు అందరూ, పాఠశాల ప్రాధనోపాఫ్యాయులు కొమ్మవరపు కృష్ణయ్య, తోటి ఉపాధ్యాయిని, యుపాధ్యాయులు తదితరులు అభినందనలు తెలియ చేసారు.