నిత్య చైతన్యశీలి
తను దహిస్తున్న
అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు
నింపిన దివిటి
మండే సూర్యుడై నిప్పుకనికై
వెలిసిన భానుడు
భూమిలో పడ్డ విత్తనం
మొలికెత్తినట్లుగా
నమ్మిన నిజాన్ని
ఎన్ని గాయాలు అయిన
మనువాదాన్ని మంట గలిపి
బౌద్ధం ఆచరించిన వాస్తవిక వాదీ
అణగారిన వర్గాలు హక్కులు
పొందేందుకు
ప్రపంచ రాజ్యాంగలల్లో
మేటి రాజ్యాంగ శిల్పి
భారత్ యావత్తుకు
రాజ్యాంగమే ఆధారం
కష్టే ఫలి అని నమ్మి
అర్ధ ఆకలి తో
ఎన్నో డిగ్రీలు దాసోహం అయ్యాయి
ప్రపంచ.మేధావి అతను
లేరు ఎవరు అతనికి సాటి
చెట్టు పేరు చెప్పి కాయలు
అమ్ముకున్నట్లు
రాజకీయ పార్టీలు రచ్చమని
అతని ఆలోచనల సంపుటి
రాజ్యాంగంలో ని ఆశయాలకు
రూప0 ఇవ్వండి
కదం కదం కలిపి
మానవతకు చేయూత నిచ్చి
కులం లేని సమాజం వైపు
అడుగులు వేద్దాం
ఫొటోలకు పోజులిచ్చే జన్మదినలు కాదు
ఆయన ఆశయాల అమలుకు
వాస్తవికంగా సాగుదాం
జై బీ0 జై జై భీం
ఉమశేషారావు వైద్య
సివిక్స్ లెక్చరర్
జి.జె.సి దోమకొండ
కామారెడ్డి జిల్లా