Pravahini



*చిటికెన రచించిన "ఓ తండ్రి తీర్పు" కు  యండమూరి అభినందనలు* 
 
          తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త, ఇంటర్నేషనల్ బెనెఓలెంట్ రీసెర్చ్ ఫోరం సభ్యులు  కథా రచయిత -డా. చిటికెన కిరణ్ కుమార్ రచించిన "ఓ తండ్రి తీర్పు " లఘు చిత్రానికి ఇటీవల ప్రముఖ సినీ కథా రచయిత  యండమూరి వీరేంద్రనాథ్ అభినందనలు అందుకున్నది.   వీరేంద్రనాథ్ మాట్లాడుతూ కథ రాసిన రచయిత,  దర్శకుడు, నిర్మాత  మంచి  ఉద్దేశంతో తీశారని, అవార్డు అందుకోవడం సంతోషకరమైన విషయం అని సందేశాన్ని తెలిపారు.
      చిత్రాన్ని  చిట్టా రాజేశ్వరరావు,  చిట్టా అపూర్వలు  శ్రీరామదూత ఫిల్మ్ మేకర్స్ పతాకంపై నిర్మించగా  ఐదు ప్రభుత్వ నంది అవార్డుల గ్రహీత గాధం శెట్టి ఉమామహేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఇట్టి చిత్రం గతంలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్  ( IFMA), పిన్ టీ. వి  ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు రెండు అందుకున్నది. పలువురు పత్రికా సంపాదకులు ప్రముఖ రచయితల మెప్పు పొందినది. చరవాణిలో అభినందనలు తెలిపిన సినీ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు కథా రచయిత డా.చిటికెన కిరణ్ కుమార్ దన్యవాదములు తెలిపారు.

0/Post a Comment/Comments