రచయిత రాథోడ్ శ్రావణ్ కి సత్కారం

రచయిత రాథోడ్ శ్రావణ్ కి సత్కారం

ఆదిలాబాద్ :-  హైదరాబాదులోని నేహ్రూ సెంట్రల్ ట్రైబల్ మ్యూజియం ఆడియో విజన్ హాల్ లో   ఆదివారం రోజున నాల్లొ అఖీల భారతీయ బంజారా సాహితీ  సమ్మేళనం కార్యక్రమం జరిగింది.  
ఈ సాహితీ సమ్మేళనానికి ‌ కవులు, రచయితలు బంజారా  సాహితీ అస్తిత్వం ,సాహిత్యానికి  కవులు చేస్తున్న కృషిని గుర్తించి భారత దేశంలోని కవులు,రచయితలచే
 కవి సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాధ్యక్షులు డా.బి ఆర్ అంబేడ్క ర్ ఓపెన్ యూనివర్శిటి  రిటైర్డ్ ప్రొ, యశ్వంత్ జాదవ్,కార్యక్రమం ప్రారంభంకులు పూర్వ మంత్రి ,అఖీల భారతీయ బంజారా సేవా సంఘం జాతీయ అధ్యక్షులు అమర్ సింగ్ తిలావత్,  సభ నిర్వాహకులు మనోహర్  చౌహన్,   భట్టు వెంకన్న చౌహన్ 
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమం అఖీల భారతీ బంజారా  సాహితీ సంఘం     
ఆధ్వర్యంలో  జరిగింది.  కవి సమ్మేళన కార్యక్రమంలో  రచయిత,ఉపన్యాసకులు, 
రాథోడ్ శ్రావణ్ ను ఘనంగా సత్కారించారు.అఖీల భారతీయ  బంజారా సేవా సంఘం జాతీయ అధ్యక్షులు,అమర్ సింగ్ తిలావత్, మహాబుబాబాద్ పార్లమెంట్ సభ్యులు పొరిక బలిరామ్ నాయక్,జాతీయ ఎస్టీ కమీషన్ సభ్యులు న్యూ ఢిల్లీ హూసేన్ నాయక్,   డా.రమేశ్ అర్యా న్యూ ఢిల్లీ గార్లు కవులు,కళాకారులు, రచయితలు, సాహితీభిమానుల  ఆధ్వర్యంలో శాలువ  ప్రశంసా పత్రంతో ఘనంగా  సత్కారించారు.ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చేందిన కవులు,రచయితలు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments