శీర్షిక: అనురాగ దేవత...!
అనురాగాల లతలుగా
అల్లుకున్న పొదరిల్లుగా
ఆనందాల హరివిల్లుగా
నాలో సగంగా
నా బాధ్యతలో భాగంగా
ఆపదలో ధైర్యంగా
సలహాల్లో మంత్రిగా
అడుగుజాడల్లో
సహధర్మచారినిగా
కష్టసుఖాల్లో తోడుగా
కలకాలం నీడగా
నాలో నీవుగా
నీలో నేనుగా
మనమిద్దరం ఒకటిగా
జన్మజన్మల బంధంగా
నా అర్ధాంగిగా
గుండె గుడిలో
ప్రేమ దేవతగా
అష్టదిక్కుల సాక్షిగా
ఆరాధిస్తూనే ఉంటాను
నా అనితగా
నా అనురాగ దేవతగా
-కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ )ఖమ్మం
చరవాణి :703250 4646
(మే 30 మా వివాహ దినోత్సవ సందర్భంగా)