నిజానిజాలు-- గద్వాల సోమన్న

నిజానిజాలు-- గద్వాల సోమన్న

నిజానిజాలు
----------------------------------------
నివురు గప్పిన నిప్పులా
నిజాలు దాగుంటాయి
ఉదయించే సూర్యునిలా
బట్టబయలు అవుతాయి

అబద్ధాలు ఎండమావులు
నీటిపై బుడగలాంటివి
కారుచిచ్చును బోలినవి
దహించివేయును బ్రతుకులు

ఊబిలా అబద్ధాలు
పెనుముప్పును తెస్తాయి
అందు కూరుకుపోతే
శిథిలాలు మిగులుతాయి

నిజాలే గెలుస్తాయి
చూడంగా నిలకడగా
కీడు చేసి పోతాయి
అబద్ధాలు చివరిగా
-గద్వాల సోమన్న,9966414580 

Post a Comment