సోమన్న రచించిన మూడు పుస్తకావిష్కరణలు హైదరాబాద్ లో -ప్రవాహిని న్యూస్

సోమన్న రచించిన మూడు పుస్తకావిష్కరణలు హైదరాబాద్ లో -ప్రవాహిని న్యూస్

సోమన్న రచించిన మూడు పుస్తకావిష్కరణలు హైదరాబాద్ లో 
--------------------------------------
కర్నూలు జిల్లా,పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు  గద్వాల సోమన్న  రచించిన "50.చిలుక పలుకులు 51.స్వగతాలు 52.జ్ఞాపకాల దొంతరలు" మూడు పుస్తకావిష్కరణలు ఒకే వేదికపై,మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ,హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ట్యాగ్ లైన్ కింగ్ డా.ఆలపాటి లక్ష్మీనారాయణ,కళారత్న  శ్రీ బిక్కి కృష్ణ, విశ్రాంత అటవీశాఖ అధికారి శ్రీ ఏ.యల్.కృష్ణారెడ్డి మరియు విశ్రాంత భూగర్భ గనుల శాఖ డైరెక్టర్ డా.శ్రీ వి.డి. రాజగోపాల్  గారల చేతుల మీద,విచ్చేసిన ప్రముఖుల సమక్షంలో వేదిక కళాభారతి, హైదరాబాద్ లో ఘనంగా ఆవిష్కరించారు.ఈ పుస్తకాల్ని కళాపోషకులు శ్రీ ఏ.ఎల్.కృష్ణారెడ్డి గారికి,శ్రీ రాజగోపాల్ దంపతులకు అంకితమివ్వడం విశేషం. పిమ్మట కృతుల కర్త గద్వాల సోమన్నను అనతి కాల వ్యవధి లో అర్థ శతాధిక పుస్తకాలు ప్రచురించినందుకు గాను, బాలసాహిత్యంలో వారి విశేష కృషికి గాను సత్కరించారు.ఇదే వేదికపై గాయకులు శ్రీ అరవా రవీంద్రబాబు గారిని గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాల్మీకి సాంస్కృతిక  సంస్థ కార్య వర్గ సభ్యులు డా.వి.యస్.రావు, శ్రీ డి.యల్.నాగరాజు,శ్రీ తలారి శంకర్ గారలు,కవులు, న్యాయవాది న్యాలకంటి నారాయణ,జర్నలిస్టు రామకృష్ణ మరియు పాత్రికేయులు పాల్గొన్నారు.పుస్తక రచయిత,బాలసాహిత్యరత్న గద్వాల సోమన్నను అందరూ అభినందించారు.

0/Post a Comment/Comments