పిల్లలం- మల్లెలం l
==============
పిల్లలం పిల్లలం పిల్లలం
మేం అల్లరి చేయని పిల్లలం
మల్లెలo మల్లెలం మల్లెలం
మీ ఉల్లం దోచే మల్లెలం !
పిల్లలం పిల్లలం పిల్లలం
కల్లా కపటం లేని పిల్లలం
మల్లెల మల్లెలం మల్లెలం
అల్లిబిల్లిగా అల్లుకున్న మల్లెలం!
పిల్లలం పిల్లలం పిల్లలం
కిల్లి గజ్జాలు లేని పిల్లలం
మల్లెల మల్లెలం మల్లెలం
మచ్చలేని మా మంచి మల్లెల0!
పిల్లలం పిల్లలం పిల్లలం
పిల్లి మొగ్గలేసేటి పిల్లలం
మల్లెలం మల్లెలం మల్లెలం
ముళ్ళల్లో దాగిన మల్లెలం!
పిల్లలం పిల్లలం పిల్లలం
మోసమెరుగని పిల్లలం
మల్లెలం మల్లెలం మల్లెలం
ఉలమంతా ఊపిరున్న మల్లెలంl
పిల్లలం పిల్లలం పిల్లలం
పెరికితనం లేని పిల్లలం
మల్లెలం మల్లెలం మల్లెలం
అల్లన మెల్లన సాగే మల్లెలం l
గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.