ధరిత్రి
అన్నపూర్ణలా ఆకలి తీర్చే
అక్షయ పాత్ర మా నేలమ్మ
సముద్రములనే వస్ర్తాలు నీకు అలంకరణ
భూమి పుత్రులు పోసిన గింజలను
గర్బగుడి లో దాచుకొని ఆశయంతో
వృక్షముగా మార్చి..
ఆకలి తీర్చి అవసరాలు తీర్చే
అవని నీకు జోహార్లు
పాతాళగంగమ్మను నీలో దాచుకుని
స్వచ్ఛతకు సంకేతమై
దున్నిన దుక్కి నీ నుదుటి కుంకుమలా
అయిదోతనం అణువణువునా
నింపుకున్న ముత్తైదువ
తారతమ్యాలు లేకుండా అన్నింటినీ
కలుపుకొని భూగర్భంలో దాచేసి ...
అభివృద్ధి అంటూ నీకు రంధ్రాలు చేసి
తాపమొనరిస్తున్న ఆధునికతను
క్షమించే భూమాత
ఇల్లాలికి నీ నామమే క్షమయా ధరిత్రి అని
రచన: గంగాజమున దడివె
వృత్తి: టీచర్
మోర్తాడ్.జిల్లా: నిజామాబాద్.TG