ప్రాణదాత
చల్లని చిరుగాలి మెల్లగా నను తాకి
నన్నే మార్చి నీదరి చేర్చే
సరాగాలు శ్రవణాలకు ఇంపుగా చేరి
నీ హృదయ స్పందన గాలిలో తరంగాలై
నా యెదను మీటే
వస్తున్న దారిలో నీ ఉనికి గాలిలో గంధమై
సుమధుర పరిమళాలు ననుతాకే
ప్రాణాలు పోసే స్వచ్చమైన గాలిని
మనమే శుద్ధిగా దాచాలని
కాలుష్యపు కోరల్లో చిక్కుకోనీయద్దని
గాలి వాటుగా కుసుమాల వాన
మనల్ని తడిపేసే సంబరాల సరాగమయ్యింది
పట్టణ ఆకాశ హర్మ్యాలలో ఉండాలని
గాలి మేడలు గగనానికి నిచ్చెనైతె ఎలా
కన్న ఊరు గాలి సెలయేరు దాటి
మన లోగిలి తాకి తన్మయత్వము కలిగింది
పిల్ల తెమ్మెరలకు గాలి సోకి
మట్టి వాసనలు వెదజల్లి
మహిలోనే మనుగడ సార్థకత చేకూరేలా
ప్రాణ దాత వాయువు పంచి పెంచింది