వజ్రాయుధమే "ఓటు"
ఓటు... బ్రహ్మాస్త్రం
ఓటరన్నా!
నీ ఓటు విలువ తెలుసుకో
మందుకు,విందుకు బందీ కాకు
ప్రలోభాలకు లొంగి
ఐదేళ్ళు బానిసగ మారిపోకు
ఊసరవెల్లిలా రంగులు ( జెండాలు) మారుస్తాం ఊకదంపుడు ఉపన్యాసాలతో బాసలు చేస్తూ
నీ ఓటు కోసం
చిత్ర విచిత్ర వేషాలు వేస్తూ
గారడి వాడిలా
మాయమాటల తూటాల్ని మనపై ప్రయోగిస్తూ
నక్క జిత్తులు వేసే నాయకుల చెరపట్టు
అవినీతి అంతానికి నడుం కట్టు..
ఒక్క సారి లొంగావో..
ఐదేండ్ల పాలనా వ్యవస్థలో
అస్తవ్యస్థ అవస్థలు భరించాలి.
అమీరైనా... గరీబైనా...
నీ ఓటు ఓ వజ్రాయుధమే ....
నీ ఓటు ఓ పాశుపతాస్త్రమే...
అన్యాయాన్ని రూపుమాపే బ్రహ్మాస్త్రమే..
విజ్ఞతతో అలోచించి ఓటు వేయి
దేశ భవితకు చేయూతనందించు
నవ చైతన్యానికి నాంది పలుకు...
*వీ.వీ. ప్రసాదరావు (చైతన్య)
*ప్రిన్సిపాల్
*అరుణోదయ మెరిట్ స్కూల్
*వి.యం. బంజర
*పెనుబల్లి.మండలం.507302
*ఖమ్మం.జిల్లా
*తెలంగాణా రాష్ట్రం
*సెల్:--- 9701099310