సామాన్యుడి సమయం
సామాన్యుడే దిక్సూచై
పాలించే వ్యవస్థ ఎంపిక కొరకు
ప్రజాశక్తి నిరూపించుకునే సమయం
రాజ్యాంగం ఇచ్చిన హక్కును
వినియోగించుకునే సమయం
భావప్రకటన స్వేచ్ఛా బాధ్యతగా భావించి
ముందుకు సాగే క్షణం
రాజకీయమంటే సేవా అని
రాజకీయ నాయకుడు అంటే సేవకుడని
అన్ని రంగాలలో సాగించే ప్రయాణంలో
అభివృద్ధికై నలుగురిని కలుపుకొని
స్వార్థం లేక నడిపించే
అసామాన్యుడు నాయకుడనీ
దేశ శాంతి భద్రతల పరిరక్షణ
జాతి నిర్మాణంలో తరాల భవిష్యత్తుకై
ఆలోచించి బాధ్యతగా భావించి ఓటు వేయు
ఓట్ల పండగ సామాన్యుడి సమయం.
గంగాజమున దడివె
మోర్తాడ్, నిజామాబాద్