నేను సిద్ధం మీరు సిద్ధమా?
----------------------------------------
దేవుని నామ స్మరణలో
బ్రతుకంతా గడిపేద్దాం!
ఇల నీతి నియమాలతో
ఆదర్శం చూపిద్దాం!
మనసులోని మలినాలు
ధ్యానించి కడిగేద్దాం!
చిన్ని చిన్ని పొరపాట్లు
చిగురులోన చిదిమేద్దాం!
క్షమాపూలు వెదజల్లి
శత్రుత్వం తరిమేద్దాం!
ప్రేమ గంధం పూసేసి
చెలిమి సేతు నిర్మిద్దాం!
బంధనాలు త్రుంచేసి
బంధాలు పెంచేద్దాం!
స్వార్థాన్ని త్రెంచేసి
సమ భావం చాటేద్దాం!
రాగద్వేషాలు పాతేసి
నవ సమాజం తెచ్చేద్దాం!
వసుధైక కుటుంబమై
విశ్వశాంతికి కృషి చేద్దాం!
మందహాసం చేసేసి
మధుమాసం రపిద్దాం!
మానవత్వం చూపించి
మనుషుల్లా జీవిద్దాం!
-గద్వాల సోమన్న,9966414580
----------------------------------------
దేవుని నామ స్మరణలో
బ్రతుకంతా గడిపేద్దాం!
ఇల నీతి నియమాలతో
ఆదర్శం చూపిద్దాం!
మనసులోని మలినాలు
ధ్యానించి కడిగేద్దాం!
చిన్ని చిన్ని పొరపాట్లు
చిగురులోన చిదిమేద్దాం!
క్షమాపూలు వెదజల్లి
శత్రుత్వం తరిమేద్దాం!
ప్రేమ గంధం పూసేసి
చెలిమి సేతు నిర్మిద్దాం!
బంధనాలు త్రుంచేసి
బంధాలు పెంచేద్దాం!
స్వార్థాన్ని త్రెంచేసి
సమ భావం చాటేద్దాం!
రాగద్వేషాలు పాతేసి
నవ సమాజం తెచ్చేద్దాం!
వసుధైక కుటుంబమై
విశ్వశాంతికి కృషి చేద్దాం!
మందహాసం చేసేసి
మధుమాసం రపిద్దాం!
మానవత్వం చూపించి
మనుషుల్లా జీవిద్దాం!
-గద్వాల సోమన్న,9966414580