Photo from గద్వాల సోమన్న

Photo from గద్వాల సోమన్న

బాల్యం బహుమానము
----------------------------------------
చిన్ననాటి స్నేహంలో
వెన్నలాంటి బాల్యంలో
ఎన్నో మధురానుభూతులు
అన్నీ శుభ శకునాలు

తీగ వంటి వయసులోన
పవిత్రమైన మనసులోన
ఆనందం పల్లవించు
అనురాగం ఉద్భవించు

చిన్ననాటి జ్ఞాపకాలు
జీవితాన ఆనవాలు
దివిలో పారిజాతాలు
భువిలో జలపాతాలు

బాల్యమే బంగారము
బ్రతుకులోన సింగారము
తిలకిస్తే నయగారము
శోధిస్తే ఆశ్చర్యము

బాల్యమే బహుమానము
జగతిలోన అసమానము
భగవంతుడు కన్పిస్తే
బాల్యాన్ని కోరుకుంటా!

సిరిసంపదలు ముందుడినా!
స్వర్గమే వెంటాడినా!
బాల్యానికి ఓటు వేస్తా!
బాల్యంలో బ్రతికేస్తా!!
-గద్వాల సోమన్న,9966414580 

0/Post a Comment/Comments