"కోడిపుంజు" స్వగతం-గద్వాల సోమన్న

"కోడిపుంజు" స్వగతం-గద్వాల సోమన్న

"కోడిపుంజు" స్వగతం
----------------------------------------
వేకువజామున లేస్తాను
గడియారం నేనౌతాను
గొంతు వీణ సవరించి నేను
పల్లెను నిదుర లేపుతాను

మెలకువగా ఉంటాను నేను
కొక్కరకో ! అంటూ  కూస్తాను
కోడిపెట్టతో  జతకట్టి
ఆపదలో తోడుంటాను

పౌరుషానికి మరోపేరు
పందెంలో  చూపుతా జోరు
నామధేయము" కోడిపుంజు"
ఇల ఇష్టమైన ''కోడిపుంజు"

చురుకుదనానికి నే చిహ్నము
గంపలు,గూళ్లు నా నివాసము
పల్లెసీమ నా చిరునామా
ఆదివారమున హంగామా

కూస్తేనేమో గడియారం
కోస్తేనేమో ఫలహారం
ఇంటిలో పెంచుకుంటారు
కంటి పాపలా చూసుకుంటారు
-గద్వాల సోమన్న,9966414580 

0/Post a Comment/Comments