'అనుబంధాలు'పుస్తకావిష్కరణ హైదరాబాద్ లో
--------------------------------------
కర్నూలు జిల్లా,పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు గద్వాల సోమన్న రచించిన 'అనుబంధాలు' 49వ పుస్తకం పద్మశ్రీ డా.కొలకలూరి ఇనాక్,విశ్రాంత అటవీశాఖ అధికారి శ్రీ ఏ.యల్.కృష్ణారెడ్డి మరియు విశ్రాంత భూగర్భ గనుల శాఖ డైరెక్టర్ శ్రీ వి.డి. రాజగోపాల్ మరియు కళారత్న శ్రీ బిక్కి గారల చేతుల మీద,విచ్చేసిన ప్రముఖుల సమక్షంలో వేదిక కళాభారతి, హైదరాబాద్ లో ఘనంగా ఆవిష్కరించారు.ఈ పుస్తకాన్ని శ్రీ రాజగోపాల్ చీకటి, అవనిగడ్డ, కృష్ణా జిల్లా వారికి అంకితమివ్వడం విశేషం. పిమ్మట కృతి కర్త గద్వాల సోమన్నను బాలసాహిత్యంలో వారి విశేష కృషికి గాను సత్కరించారు.ఈ కార్యక్రమంలో కేంద్ర సాహితీ సలహా మండలి సభ్యులు డా.నాళేశ్వరం శంకరం,గజల్ క్వీన్ మల్లీశ్వరి,డా.జెల్ది విద్యాధరరావు,సినీ నిర్మాత కంఠంనేని రవిశంకర్ ,కవులు మరియు పాత్రికేయులు పాల్గొన్నారు.పుస్తక రచయిత,బాలసాహిత్యరత్న గద్వాల సోమన్నను అందరూ అభినందించారు.