ఆమె
ఒక ఉద్యమకారిణి
తొలి మహిళ ఉపాధ్యాయు రాలు గా
బడుగులకు బలహీనుల
సరస్వతి అయ్యే
అక్షరబుద్ధులు ఎన్నో నేర్పే
మనువాదుల దాడులు
ఎన్నో తట్టుకొని
ముళ్ళకంచెలను దాటిన
సమాజహీతకారిణి
సత్యశోధక్ సమాజ్ స్థాపించి
పతి ఆశయాలను ముందుకు
నడిపిన సతి
కుష్టు రోగులు సేవలో
దళితుల చిన్నారులను
చంకన పెట్టుకొని
సేవలు ఒసంగిన తల్లి
కరువు కాటకాలు సంభవించినప్పుడు
20 వేళా మంది అన్నము పెట్టిన అన్నపూర్ణ
వితంతు వివాహాలకు కృషి చేసి
అంటరానితనం నిర్ములనకు
కృషి చేసిన సాద్వి
యష్వoథ్ అనే బ్రహ్మాణ పిల్లవాడిని దత్తత తీసుకొని
అణగారిని వర్గాల అభ్యున్నతి
విద్యే మూలం,విద్యే మార్గం
అని నమ్మి 52 పాఠశాలలు
ఏర్పాటు చేసి ఆశయం వైపు
రణం చేసిన ఒక శక్తి
భర్త చితికి నిప్పు పెట్టి
కొత్త సంప్రదాయానికి
తెర లేపిన సంస్కరణ వాది
నేటి మహిళలు చిన్న సమస్యలకు క్రుంగక
సాగాలి ఆమె ఆశయం వైపు
ఆమె ఒక మేలుకొల్పు
నేటి ప్రగతికి మలుపు
ఉమాశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి