"ముద్ద మందారాలు" పుస్తకావిష్కరణ -పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారిచే-ప్రెస్ క్లబ్ ,సోమజిగూడ, హైదరాబాద్.

"ముద్ద మందారాలు" పుస్తకావిష్కరణ -పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారిచే-ప్రెస్ క్లబ్ ,సోమజిగూడ, హైదరాబాద్.

"ముద్ద మందారాలు" పుస్తకావిష్కరణ 
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు,తెలుగు బంధువు  గద్వాల సోమన్న  రచించిన 46వ కొత్త పుస్తకం "ముద్ద మందారాలు" బాలగేయాల సంపుటి పద్మశ్రీ కొలకలూరి ఇనాక్,శ్రీ ఏ.యల్.కృష్ణారెడ్డి,ప్రముఖ సాహిత్యవేత్త డా.వడ్డేపల్లి కృష్ణ  మరియు కళారత్న డా.వి.డి.రాజగోపాల్ గారల చేతుల మీద ప్రెస్ క్లబ్,సోమజిగూడ, హైదరాబాద్ లో నూతన ఆంగ్ల సంవత్సరాది-2024 మరియు విశ్రాంత భూగర్భ గనుల అధికారి వి.డి. రాజగోపాల్ గారి జన్మదినం సందర్భంగా  ఘనంగా ఆవిష్కరించారు.ఈ పుస్తకాన్ని  కళాపోషకులు, విశ్రాంత ఫారెస్ట్ ఆఫీసర్  ఏ.యల్.కృష్ణారెడ్డి గారికి అంకితమివ్వడం విశేషం..ఈ కార్యక్రమంలో వోలెటి పార్వతీశం,యాంకర్ స్వప్న,డా.మహమ్మద్ రఫీ,బిక్కి కృష్ణ,రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి,వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కవులు,ఉపాధ్యాయులు,కళాకారులు మరియు పాత్రికేయులు జిల్లా విద్యార్థులు పాల్గొన్నారు.పుస్తక రచయిత,బాలసాహిత్యరత్న గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు,శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభినందించారు.

0/Post a Comment/Comments