ఓ... టింగ్... మిషన్…
02-10-2023
ఉద్యమానికి ఊపిరి పోసిన
జయశంకర్ సార్ సాక్షిగా కదిలిన
ఉపాధ్యాయ విధ్యార్థిలోకం
ప్రత్యేక తెలంగాణ కల సాకారమైన క్షణం
బంగారు తెలంగాణ కొరకు పయనం
ఊరూరా ఉద్యమ జెండానెత్తిన జనం
కాలోజీ కలం సాక్షిగా కదలిన ప్రజానీకం
తెలంగాణ జెండాను గుండెకత్తుకున్న జనం
కవులు కళాకారులు కలగలిసిన తరుణం
గద్దర్ సాక్షిగా కదలిన గళాల గాలులు
మేధావుల పునాదుల తాకిన క్షణం
తెలంగాణ ఎజెండాను గుండెల్లో మోస్తున్న తరం
మారిన మ్యాపులు చెదిరిన హద్దులు
కట్టబడిన కాళేశ్వరాలు... భగీరథలు...
నిర్మితమవుతున్న గుళ్ళు ప్రక్షాళనవుతున్న బళ్ళు
వెడల్పవుతున్న రోడ్లు... కూలిపొయ్ నెలుస్తున్న భవానాలు
ట్రాన్స్ఫర్లతో పరుగులిడుతున్న ఉపాధ్యాయ లోకం
నోటిఫికేషన్లతో బిజీ అవుతున్న విధ్యార్థి లోకం
ఎన్నికల సమరంలో సమిథలవుతున్న నాయక లోకం
ప్రకటించిన పథకాలతో పరిగెడుతున్న ఓటర్ లోకం
అన్నీ అధికారం కోసమే అనే ప్రతిపక్షం తేలనున్న భవితవ్యం
ఓటును ప్రసాధించిన ప్రజాస్వామ్యం నోటును వెలేయాలి మనం
నిన్నటి రేపటి తరం నిజమైన నేటి ప్రజాసేవక దళం
నేటి నుండి ఎదిరిచూసే ఓటింగ్ మిషన్ పొంతనలేని జ్ఞాపకాల దొంతరలో
ఇదంతా అతుకుల గతుకుల పర్వం భారతాన్ని మించిన గర్వం
ఇందులో కౌరవు లేవరో పాండవు లేవరో ఎందరు అభిమాన్యులౌతారో
పునః నిర్మాణమంటే పురాణాలను కూల్చి సనాతనాలను నిర్మించడమైంది
లిఖించ బడాల్సిన చరిత్ర రచించబడుతోంది గమ్యం గాయాల్ని మాన్పుతుందో లేదో
- రాజేందర్ మాసు, ఎస్.ఏ. తెలుగు,
జెడ్.పీ.హెచ్.ఎస్. రాయపర్తి, మం. నడికూడ, జి. హన్మకొండ.