Pravahini

కవి వరశ్రీకి సాహితీ విఖ్యాత రికార్డ్ పురస్కారం - 2023 * 

______________________________

 

ఆర్యాణీ సకల కళావేదిక,  కరీంనగర్,  శ్రీ గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ, మంత్రపురి,  తెలంగాణ వారి సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాల అంతర్జాతీయ స్థాయి రికార్డు అక్టోబర్ 15 ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల మధ్యలో వాట్సాప్ వేదికగా నిర్వహించడం జరిగింది. ఇందులో ఆరు అంశాలు ఇచ్చి ఒక గంట సమయంలో ఆరు అంశాలపై  కవితలు రాసి పంపుటకు సమయం ఇవ్వబడింది. ఈ పోటీలో మొత్తం 60 మంది కవులు పాల్గొన్నారు.
ఇందులో రాసిన అత్యుత్తమ నాలుగు కవితలకు గాను కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన  కవి శ్రీ E.V.V.S. వరప్రసాద్ ( వరశ్రీ ) గారికి *సాహితీ విఖ్యాత రికార్డ్ పురస్కారం - 2023* అందజేశారు.  వీరి చేతికి బంగారు కంకణం తొడిగి, శాలువాతో సత్కరించినారు.  కార్యక్రమం నిర్వాహకులు, వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ దూడపాక శ్రీధర్ గారు, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గారు, ప్రత్యేక అతిథులుగా శ్రీ మోటూరి నారాయణ రావు గారు, వైరాగ్యం ప్రభాకర్ గారు, పొర్ల వేణు గోపాల్  గారు మొదలైన వారు పాల్గొన్నారు. విభిన్న ప్రాంతాల నుండి వచ్చిన కవులు  హాజరయ్యారు. ఈ కార్యక్రమం కరీంనగర్ లో  కలక్టరేట్ రోడ్ లో గల ఫిల్మ్ భవనము నందు ఘనంగా జరిగింది.

0/Post a Comment/Comments