మల్టీ జోన్ మాయాజాలం
శివ భక్తులు కానవసరం లేదు
కుల మతాలతో పనేలేదు
వారంలో ఇది రెండో జాగారం
కురుక్షేత్రానికి తగ్గని పోరాటం
పంతుళ్ళను పల్టీ కొట్టిస్తున్న
మల్టీ జోన్ మాయాజాలం
పందొమ్మిది జిల్లాలకు పరిగెడుతున్న
ప్రమోషన్ బదిలీల పర్వం
సగం తెలంగాణ గూర్చి
ఆలోచించాల్సిన అవసరం
ఇంతటి అవకాశాన్ని కల్పించినా
ప్రభుత్వానికి కృతజ్ఞత తెల్పలేని వైనం
మూడు వందల పదిహేడు
సీనియర్లను తమగూటికి చేర్చి
నాల్గురోజులైనా కాలేదు మూటాముల్లె సదురుకుని
సర్వీసులో ముందుకు సాగాల్సిన పయనం
యాభై ఎనిమిది నుండి అరవై ఒక్కటి పెంచి
షుగరు బీపీలతో కీళ్ళలో నొప్పితో
రిటైర్మెంట్ కావాల్సిన వయస్సులో
ఇంక్రిమెంట్లు పెంచిపచ్చపెన్ను చేతులబెట్టవట్టే
పెద్దసార్లను చేస్తున్న ఈ పద్ధతికి
పాలాభిషేకాలకన్నా ఇంకేం ఇవ్వగలం
ఈసారన్నా పాలపాకెట్లకు బదులు
స్వచ్ఛమైన పాలను వాడుదాం
- రాజేంద్ర, 9010137504
జెడ్పీహెచెస్ రాయపర్తి, నడికూడ, హన్మకొండ.