తెలుగు భాష తీయన- గద్వాల సోమన్న

తెలుగు భాష తీయన- గద్వాల సోమన్న

తెలుగు భాష తీయన
--------------------------------------
తెలుగులోని తీయదనం
ఎక్కడైనా ఉన్నదా   ?
పద పదమున చక్కదనం
ఈ సృష్టిలో ఉన్నదా?

తెలుగు వెలుగు మెత్తదనం
వెన్నలోన ఉంటుందా?
అక్షరాల మేలి గుణం
అంగట్లో దొరుకుతుందా?

మాతృభాష గొప్పదనం
మంట కలుపుట న్యాయమా?
తెలుగు భాష పూలవనం
త్రుంచివేయుట ధర్మమా?

తెలుగు తల్లి బిడ్డలగా
గర్వించుట ఉత్తమం
వెలుగులీను దివ్వెలగా
సాగుట సర్వోన్నతం

-'బాలబంధు' గద్వాల సోమన్న,
9966414580. 

0/Post a Comment/Comments