Pravahini

తెలంగాణ యోధుడా
పోరాటాల ధీరుడా
కౌండిన్య గోత్ర పుత్రుడా
ఆ మహర్షి తేజుడా
గౌడ జన ఆణిముత్యమా
ఎల్లమ్మ దేవత ఆరాధకుడా
ఔరంగా జేబు సేనాపతి ని
ఓడించి న గేరిళ్ల యుద్ధ తంత్ర
వీరుడా
కధం కధం కలిపి
రణం చేసి
కుల వృత్తిని
త్యజించి
నిజాం నవాబు ఓడించిన
గోల్కొండను ఏలిన
ధీరోధత్తుడు
అగ్ర కులాల ఆధిపత్యం
తిరుగు బావుట ఎగర వేసి
మొఘలు పాలకుల
అరాచక పాలనకు
చారామగీతం పాడి
బహుజన రాజ్య కాంక్ష
బానిస బతుకులు కు సమాధి
కట్టెందుకు కత్తి పట్టి
అన్ని వర్గాల శ్రేయస్సును
కాంక్షించి న
బహుజన యోధుడా

0/Post a Comment/Comments