తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలో
ప్రముఖ సాహితీవేత్త డా.చిటికెన కిరణ్ కుమార్ కు
ఘన సత్కారం
----------------------
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకను సిరిసిల్ల పట్టణంలో ఘనంగా నిర్వహించినారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దశాబ్ది అవతరణ వేడుకలలో భాగంగా *తెలంగాణ సాహిత్య దినోత్సవం కవి సమ్మేళనం* సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ని డాక్టర్ సి.నారాయణరెడ్డి స్మారక గ్రంథాలయం లో ప్రభుత్వ అధికారులు, నాయకులు ఘనంగా నిర్వహించినారు. జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, పలు జాతీయ,అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యుడు డాక్టర్ చిటికన కిరణ్ కుమార్ పాల్గొని సూచించిన తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ప్రగతి అంశం ఆధారంగా *దశాబ్దికి స్వాగతం* శీర్షికతో తన కవితా గానం చేశారు, తదుపరి చిటికెన ను శాలువా, జ్ఞాపిక, ప్రసంసా పత్రము, నగదు లతో అధికారులు, నాయకులు, ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర పవర్ లూమ్, అండ్ టెక్స్ టైల్స్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా ప్రభుత్వ అధికారులు అసిస్టెంట్ కలెక్టర్, ముఖ్య ప్రణాళికా అధికారి, పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం జిల్లా రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శులు మరియు జిల్లా కవులు, రచయితలు కళాకారులు పాల్గొన్నారు.