తొలిఏకాదశి(శ్రీలతరమేశ్ గోస్కుల హుజురాబాద్)

తొలిఏకాదశి(శ్రీలతరమేశ్ గోస్కుల హుజురాబాద్)

సర్వాంతర్యామి యోగ ముద్రకు ఉపక్రమిస్తుండగా
అలసటెరగని సప్తశ్వ వాహకుడు
దక్షిణ వాలుగా పయనమారంభించిన వేళ...
పగలుతో రేయి సమయాధిక్యంకై జరిగిన పోటిలో నెగ్గి...
అధికనిద్ర ఘడియలు పొందినదే  శయనైక ఏకాదశి...

ప్రకృతిన జరిగే మార్పులు
కుంటుపడనియ్యని జన జీవనానికి...
రోగపీడలను భరించుటకై
శరీరాన్ని... మనసునీ...
బలోపేతం చేయడమే
లంఖణం పరమౌషధంగా మారినది...

నూతనోత్తేజం సంతరింపుకై
జన చైతన్యం నొందడానికి
పేలపిండి నైవేద్యంగా
ఆచారంతో మమేకమై...
ఆరోగ్యమందించే  వరప్రదాయినిగా మారినది...

గోపూజతో సర్వపాపహరణమైన  మనస్సు...
పశుపక్ష్యాదులకు సేవ చేసి తరించాలని...
కరువు కాటకాలకు తావియ్యకుండా
పాడి పంటలను పెంచాలనీ...
ప్రాణిపట్ల దయనెంతో నేర్పినది...

దైవ సన్నిధిలో మనసు నిశ్చలత్వానికై
సోమరితనాన్ని తరిమేయడమే పరమావధిగా...
ఉపవాస దీక్షలకు తొలి ఏకాదశి నాందియైనది...

శ్రీలతరమేశ్ గోస్కుల
హుజురాబాద్.

0/Post a Comment/Comments