శీర్షిక: వేసవి సెలవుల్లో. పేరు:శ్రీకాంత్

శీర్షిక: వేసవి సెలవుల్లో. పేరు:శ్రీకాంత్

శీర్షిక:వేసవి సెలవుల్లో 

వేసవి సెలవులు ఏప్రిల్ 24 న పరీక్షలు అయిపోయిన మూడు రోజులకు నా స్నేహితులు చాలామంది వాళ్ళ అమ్మమ్మ, మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు. నేను మా అమ్మమ్మ ఇంటికి వెళ్దామంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, మా ఊరు ఒక్కటే అదే అమడబాకుల, కావున నేను ఊర్లోనే ఉండిపోయా. అలాగా కొన్ని దినాలు గడిచిపోయాక, మా ఊర్లో పెద్దమ్మతల్లి పండుగ వచ్చింది. పండుగనం చాలా మంచిగా అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. అందరి ఇళ్లకు వారి బంధువులను ఆహ్వానించారు. వాళ్ళ గడపలకు మామిడి తోరణాలు కట్టుకొని ఉన్నాయి. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లినా సోమవారం, మరియు మంగళవారం పండుగ. పెద్దమ్మ తల్లికి "పోతును" బలిచ్చినం. మంగళవారం నాడు అందరి ఇళ్లల్లో, మాంసం వాసనలు మసాలా దినుసులతో గుమగుమలాడుతున్నాయి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి పండుగా అయిపోయాక తిరిగి మా ఇంటికి వచ్చాం. అలా తర్వాత నేను మా వదిన వాళ్ళ ఊరికి పండుగకు వెళ్ళినాను. మా ఊరు నుండి ఆటోలో ఎక్కి కొత్తకోట దగ్గర  తర్వాత బస్టాండ్ లో బస్సు ఎక్కి, జడ్చర్లకు వెళ్లినాము. తర్వాత పాత బస్టాండ్ దగ్గర జడ్చర్లలో గాంధీ బొమ్మ వరకు, వెళ్లి అక్కడ దిగినాము. మా అన్న కారు తీసుకొని వచ్చి, మమ్మల్ని తీసుకొని వెళ్ళాడు అక్కడికి వెళ్లినాడు. సాయంత్రం ఆరోజు కూడా మళ్లీ మైదానానికి వెళ్లి, బాగా ఎంజాయ్ చేసాం. వాళ్ల ఊర్లో పండుగ ఉంది. అది "బొడ్రాయి" పండుగ, పెద్దమ్మ పండుగ. అక్కడ కూడా చాలా బాగా చేశారు. పండగకు
పోతరాజులు వచ్చారు. చాలా మంచిగా జరిపారు. అలాగే ఇంటికాడ ఏం తోచకుంటే మహబూబ్ నగర్ లోని "మయూరి" పార్కుకు ఆటో మాట్లాడుకుని వెళ్లినం. అక్కడ దిగిన తర్వాత ఒక్క మనిషికి 30 రూపాయల టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన, మొదట బాగా ఆటలు ఆడుకుని వెళ్ళాం. అలా వెళ్తుంటే సీతాకోకచిలకలా "ఉద్యానవనం" ఒకటి అక్కడ ఉంది. అక్కడ చాలా సీతాకోకచిలుకలు రంగురంగుల్లో, చాలా ముచ్చటగా ముద్దుగున్నాయి. అలా అక్కడ చాలా ఫోటోలు దిగిన తర్వాత, అక్కడ టీ కప్పు ఆటో మీద ఎక్కి అక్కడ ఫోటోలు దిగడానికి సరైన "లోకేషన్" కోసం వెళ్ళాం. అక్కడ "ఆస్ట్రిచ్" పక్షులను చూసాం. చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ పక్షులు ఎంతో విచిత్రంగా ఉన్నాయి. పుస్తకాల్లో చూడడమే గాని, ఎదురుగా నిలబడి చూడడం అదే మొదటిసారి. పార్కును అలా చుట్టూ తిరిగి వచ్చేసరికి అందరికీ కాస్త అలసట వచ్చేసింది. అలాగే కష్టం కూడా అనిపించింది. జెండా  కొంచెం కొండపైన ఉంది. అక్కడికి నడిచి వెళ్ళాలి. ఆ జెండా చాలా బాగుంది. సరే ఎలాగో అలాగు కష్టపడుతూ, జెండా దగ్గరికి వెళ్లి ఫోటోలు దిగిన తర్వాత, కిందికి దిగివచ్చి, ఆకలితో అలమటిస్తున్న మాకు తినాలని కోరిక కలిగింది. అప్పటికే మేము ముందుగానే తీసుకువచ్చిన చికెన్ పులుసు, చేపలు, చపాతీలు ఉన్నాయి. తర్వాత అందరం సరదాగా పార్కులో కూర్చొని బాగానే తిన్నాం. ఆ చల్లటి గాలికి ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది. ఇంకా తిన్న తర్వాత మెల్లగా కాసేపు విశ్రాంతి తీసుకుని, ఆ పార్కులో ఉన్నటువంటి పిల్లలు ఆడుకునే రకరకాల జారుడుబల్లలు, రంగు రాట్నాలు, ఊయలలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిపై తిరుగుతూ చాలా సంతోషించాం. ఇంకా సాయంత్రం కావొచ్చింది. అలా మయూరి పార్కు చూడడం చాలా సంతోషంగా అనిపించింది. చివరికి గేటు దగ్గర వచ్చి అందరం కలిసి ఫోటో దిగి, ఇంటికి తిరిగి వెళ్ళాం. అలసిపోయాం. స్నానాలు చేసుకొని పడుకున్నాం. ఆ విధంగా ఒక ప్రదేశాన్ని చూడడం చాలా సంతోషంగా అనిపించింది. మా బంధువులతో మా స్నేహితులతో అలా ఊర్లు తిరుగుతూ చాలా సరదాగా వేసవి సెలవులు గడిపాను.

ఎ. శ్రీకాంత్,
9వ, తరగతి,
జి.ప.ఉ.పాఠశాల,
అమడబాకుల,
వనపర్తి జిల్లా.

0/Post a Comment/Comments