Pravahini



 *దశాబ్ది ఉత్సవాల సందర్భంగా...
ప్రముఖ సాహితీవేత్త  డా.చిటికెన కిరణ్ కుమార్ కు ఎ.కె.జైన్ ఫౌండేషన్ సన్మానం* 
----------------------

         తెలంగాణ  రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల సందర్భంగా  ఎ.కె.జైన్ ఫౌండేషన్ డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ని ఘనంగా సన్మానించినది.
             సమకాలీన సమాజ సమస్యలపై కలంతో గళం విప్పుతూ  సందేశాత్మక లఘు చిత్రాలను రాస్తూ సాహిత్యంలోనే కొత్త ఒరవడిని సృష్టిస్తున్న  సిరిసిల్ల వాసి  ప్రముఖ కవి, రచయిత, ఎడిటోరియల్ కాలమిస్ట్, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ గౌరవ సభ్యుడు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ను ఈరోజు  ఎ. కె. జైన్ ఫౌండేషన్ సంస్థ కార్యాలయం లో ఘనంగా సన్మానించింది.  ఈ సందర్బంగా ఫౌండేషన్  చైర్మన్  అమృత్ కుమార్ జైన్  మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రఖ్యాత కవి, సిరిసిల్ల ఆణిముత్యం డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ అని,  ఆయనకు మంచి భవిష్యత్తు ఉన్నదని  కొనియాడారు.   పద్మశ్రీ పురస్కారం చిటికెనకు ఇచ్చి సముచిత స్థానం కల్పించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ సంవత్సరం తమ ఫౌండేషన్ తరుపున చిటికెన పేరు ను నామినేట్ చేస్తామన్నారు. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిధి నవభారత నిర్మాణ సంఘం అధ్యక్షులు ఎస్. రవికుమార్ పాల్గొని డా.చిటికెన కిరణ్ కుమార్ ని గత ఎన్నో సంవత్సరాలుగా  చూస్తున్నానని ఆయనలో సాహిత్యం రోజురోజుకు ఎంతో అభివృద్ధి చెంది ఉన్నత శిఖరాల వైపు ప్రయాణిస్తుందని తనకు ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు వచ్చినప్పటికీ సాహిత్య సేవలో నిరంతరం కృషి చేస్తున్నటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి అని సాధారణంగా కనిపించే చిటికెన లో ఎంతో ప్రతిభ దాగి ఉన్నదన్నారు.ఈ కార్యక్రమం లో నగరానికి చెందిన ప్రముఖులు, సాహితీవేత్తలు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments