---------- Forwarded message ---------
From: Sesharao Vaidya <umasesharao@gmail.com>
Date: Thu, 6 Apr, 2023, 6:37 am
Subject: ఆంజనేయ జయంతి
To: <pravahini.thewritersblog.post_4@blogger.com>
From: Sesharao Vaidya <umasesharao@gmail.com>
Date: Thu, 6 Apr, 2023, 6:37 am
Subject: ఆంజనేయ జయంతి
To: <pravahini.thewritersblog.post_4@blogger.com>
నేడే ఆంజనేయ స్వామి జయంతి
ఎక్కడ శ్రీరాముడు కొలువై ఉంటాడో, ఎక్కడ శ్రీరామ నా మం వినిపిస్తుందో.. అక్కడ హ నుమంతుడు ఉంటాడు. ఆయ నను మించినభక్తుడులేడంటూ శ్రీ రామచంద్రుడుఆప్యాయంగా ఆలింగనంచేసుకున్నభాగ్యశాలి హనుమంతుడు.అలాంటిహను మంతుని జన్మ వృత్తాంతంలోకి వెళితే .ఒకసారి దేవలోకంలో ఇంద్రాది దేవతలు కొలువుదీరి ఉండగా, 'పుంజికస్థల' అనే అ ప్సరస బృహస్పతితో పరిహాస మాడబోయింది. ఆమె చేష్టలకు ఆగ్రహించినబృహస్పతి,భూలో కాన 'వానర స్త్రీ'గా జన్మించ మనిశపించాడు.తీవ్రమైనఆందో ళనకి లోనైనఆమెశాపవిమో చనం ఇవ్వమంటూ కన్నీళ్లతో ప్రాధేయపడింది. కారణ జన్ము డైన వానరవీరుడికి జన్మను ఇచ్చిన తరువాత ఆమె తిరిగి దేవలోకానికి చేరుకో వచ్చు నం టూ ఆయన అనుగ్రహించాడు.
దాంతో 'పుంజికస్థల' భూలో కా న'అంజనాదేవి'గాజన్మించి,కాల క్రమంలో 'కేసరి'అనే వానరు డి నివివాహమాడింది.శాపవిమోచానార్ధం తనకి వీరుడైనటువం టిపుత్రుడినిప్రసాదించమంటూ ఆమెవాయుదేవుడినిప్రార్ధించింది.ఈ నేపథ్యంలో రాక్షస సంహా రంకష్టతరంగామారడంతో,పర. మేశ్వరుడిఅంశతోజన్మించినవా డి వలనే అది సాధ్యమనిబ్రహ్మ విష్ణుభావించారు.అయితేపరమశివుడివీర్యశక్తినిపార్వతీదేవి భరించలేకపోవడంతో ,వాయుదేవుడి ద్వారా దానిని స్వీక రిం చినఅంజనాదేవిగర్భందాలుస్తుంది.అలాశివాంశసంభూతుడైన హనుమంతుడు 'చైత్రమా సం శుక్ల పక్షం పౌర్ణమి' రోజున అంజనాదేవి గర్భాన జన్మించా డు.తల్లి ఆలనాపాలనలో పెరు గుతోన్న హనుమంతుడు, ఆకా శంలోని సూర్యుడిని చూసి దా నిని తినేపండుగాభావించితిసు కురావాలనే ఉద్దేశంతో ఆ కాశ మార్గానబయలదేరాడు.ఆయన్ని చూసిన ఇంద్రుడు త న వ జ్రాయుధాన్ని విసురు తా డు. దాని ధాటికి తట్టుకోలేక అ క్క డి నుంచి కింద పడిపోయి న హనుమంతుడి 'ఎడమ దవ డ'కి గాయం కావడంతో స్పృహ కోల్పోయాడు. దాంతో దేవాధి దేవతలంతా అక్కడికి చేరుకొని హనుమంతుడుచిరంజీవిగాఉం డాలని ఆశీర్వదించారు.
అలా దేవతల నుంచి వరాలు పొందిన హనుమంతుని అల్లరి చేష్టలకు అడ్డూ అదుపూ లేకుం డా పోయింది. దాంతో ఎవరైనా గుర్తు చేస్తే తప్ప, అతని శక్తి అ తనికి తెలియకుండా ఉండేలా ఋషులు శపించారు. సూర్య భగవానుని అనుగ్రహంతో సక ల విద్యలను అభ్యసించిన హ నుమంతుడు,రామాయణానికి
ఓ నిండుదనాన్ని తీసుకువచ్చా డు. సుగ్రీవుడిలో కదలిక తీసు కు వచ్చి అతని సైన్యాన్ని ముం దుకునడిపించడంలోనూ .లంక లో ఉన్న సీతమ్మవారి ఆచూకీ తెలుసుకోవడంలోను .వారధి నిర్మించడంలోను యుద్ధరం గా నలక్ష్మణుడుమూర్ఛపోయినప్పుడు 'సంజీవిని' పర్వతాన్ని పెకిలించి తీసుకురావడంలోను హనుమంతుడు కీలకమైన పా త్రను పోషించాడు. అందుకే హ నుమంతుడులేని రామాయ ణాన్ని అస్సలు ఊహించలేం.
త్రిపురాసుర సంహారం' సమ యంలో పరమ శివుడికి శ్రీ మ హా విష్ణువు తన సహాయ సహ కారాలను అందించాడు.అందు వల్లనే లోక కల్యాణం కోసం శ్రీ మహా విష్ణువు రామావతారం దాల్చినప్పుడు, శివుడు .ఆంజ నేయస్వామిగా అవతరించి,రా వణ సంహారానికి తన సహాయ సహకారాలను అందించిన ట్టు పురాణాలుచెబుతున్నాయి.దు ష్ట గ్రహాలను తరిమికొట్టి ఆయు రారోగ్యాలను ప్రసాదించే హను మంతుడిని పిల్లల నుంచి పెద్ద ల వరకూ అంతా ఎంతో ఇష్టప డతారు.ఇకప్రతిఊరిలోరామాలయం వుంటుంది ఆయనతో పాటు హనుమంతుడు కూడా అందుబాటులోఉంటాడు.అందు వలన ఈ హనుమంతుని పుట్టినరోజునప్రతిఊరిలోఆయ నకు ప్రదక్షిణలుచేయడం .ఆకు పూజలుచేయించడం .ఆయనకి ఇష్టమైనవడ'మాలలువేయిం చడం జరుగుతుంటుంది. ఈరో జున ఆంజనేయ స్వామి దం డకం హనుమాన్ చాలీసా చద వడం ఉత్తమ ఫలితాలను ఇ స్తుంది.యత్ర యత్ర రఘు నా థకీర్తనం తత్ర తత్ర స్తు తమ స్తకాంజలిమ్భాష్ప వారి పరి పూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్"
"యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మా రుతిఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండునుశ్రీ ఆంజనేయస్వామి వారి జన్మదినం చైత్ర శుక్ల పూ ర్ణిమ రోజున జరిగింది. ఈ రో జున హనుమద్భక్తులు రోజం తా ఉపవాసముండి, హను మ న్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు.విశేషాలుఆంజ నేయస్వామికిపూజచేయవలసినప్రత్యేకదినములుశనివారం,మంగళవారంఇంకాగురువారం.పురాణకధ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అత డి నితలక్రిందలుగాపట్టి,యెగరవేయసాగాడు. శని తన అపరా ధా న్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలి పెడతాడు. అందుకే ఏడున్నర యేళ్ళ శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాసన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో
ఏ రోజైనా స్వామికి పూజ చేసుకొనవచ్చు.స్వామికి ప్రీతి పాత్రమైనపువ్వులుతమలపాకుల దండఒక కధ ప్రకారం, అశోకవనంలోఉన్నసీతమ్మవారికి,హనుమంతుడురాములవారి సందేశము చెప్పినప్పుడు, అ మ్మవారుఆనందంతోహనుమంతునికి తమలపాకుల దండ వే సారట, దగ్గరలో పువ్వులు కని పించక! అందుకే స్వామికి తమ లపాకుల దండ అంటే ప్రీతి అనిచెప్తారుమల్లెలుగురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడంచాలశ్రేష్టం.పారిజాతాలుస్వామికిపరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాత పూలతో పూజ చేస్తారు.తులసి:తులసి రాములవారికిప్రీతిపాత్రమైనది, అందుకేహనుమంతునికికూడా ఇష్టమైనది.కలువలుకలువ పువ్వులుకూడాశ్రీరాములవారికి యెంతో ఇష్టమైన పూలు. భ రతుని ఉన్న ఒక్క కోవెల ఇరిం జలకుడ, కేరళలో అతనికి కలు వపూలమాలవెయ్యడంసాంప్రదాయం. శ్రీరాములవారికిహను మంతుడంటే భరతుడు మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తా రు.పంచముఖహనుమాన్
శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హను మంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరం ఇలా చెప్పబడింది.తూర్పుముఖముగా హనుమంతుడు:పాపాలను హరించి, చిత్త శుద్ధిని కలుగ చేస్తాడు.. దక్షిణ ముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్నిపోగొట్టి,విజయాన్ని కలుగజేస్తాడు. పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ,శరీరానికి కలిగే విష ప్రభావాలనుండిరక్షిస్తాడు.ఉత్తరముఖముగాలక్ష్మీవరాహమూర్తి: గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని , జయాన్ని, మంచి జీవన సహ చరిని, బిడ్డలను ప్రసాదిస్తాడు.
హనుమంతుని పుట్టిన రోజున పూజ ఎలాచేయాలిచైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్పుట్టిన రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలూ చేకూరుతాయి. ఆ రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపమెలిగించే వారికి ఆయు ర్దాయం, సుఖసంతో షాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
ఇంకా హనుమంతుని ఆల యాల్లో ఆకుపూజ చేయిం చడం, హనుమాన్ కళ్యాణం జరిపే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం.
అలాగే గృహంలో పూజచేసే భక్తులు, పూజామందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవే ద్యా నికి బూరెలు, అప్పాలు, దాని మ్మ పండ్లు సమర్పించు కోవ చ్చు.పూజా సమయంలో హ నుమాన్ చాలీసా ఆంజనే య సహస్రము, హనుమచ్చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా "ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్త యి న తర్వాత ఆంజనేయ ఆల యాలను సందర్శించుకోవడం మంచిది. ఇంకా మద్దిమడుగు, పొన్నూరు, మంత్రాలయం, కొండగట్టు, మక్తల్, భద్రాచలం, బీచుపల్లి, అరగొండ, కసా పు రం, గండిక్షేత్రం వంటి పుణ్య క్షేత్రాలను దర్శించుకునే వారికి కోటిజన్మలపుణ్యఫలంసిద్ధిస్తుం దని విశ్వాసం. ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు, హనుమాన్ చాలీసా పుస్తకము లు దానం చేసేవారికి సుఖసం తోషాలు చేకూరుతాయని నమ్మకం.
ఉమాశేషారావు వైద్య
9440408080