షాబాన్ నెలలో
నెలవంక దర్శనంతో
కఠినమైన ఉపవాసం
వుంటారు భక్తితో
స్వచ్ఛమైన జీవన
సూత్రాలను సూచించే
పవిత్రమైన గ్రంధము
ఖురాన్ అందించే*
రంజాన్ మాసము
ముస్లీమ్లకు పవిత్రము
దానాధర్మాలు చేయ
శ్రేష్ఠమైన మాసము
అబద్దాలు ఆడకుండ
ప్రవక్తను ధ్యానించు
పేదలకు విశేషంగా
సాయం అందించు
కఠినమైనది రంజాను
ఉపవాస దీక్ష
నీరు తాగకున్న
అల్లాహ్ నే రక్ష
అవసరమైన వారికి
సాయంచేసే గుణాన్ని
అలవర్చుకోవాలి
రంజాన్ మాసాన్ని
స్వర్గానికి చేరాలని
ఉపవాసమాచరింతురు
మోక్షాన్ని పొందాలని
అల్లాహ్ ను ధ్యానింతురు
పేదల ఆకలి బాధ
తెలిపేదే ఉపవాసము
సాయం చేయాలని
తెలిపడమే మూలము.
రచన:తాళ్ల సత్యనారాయణ