వ్యధ

వ్యధ

వ్యయం మాత్రమే
   పేరులోనే సాహయం
   ఆయన లేనిది సృష్టి గమం లేదు
పంటను సృష్టించి
అన్నపూర్ణ అతను
ఆరు నెలల కష్టం
పక్కటెముకలు ఇరిగే లా
పనిచేసే
ఎండ వేడిమి తాళలేక
హాయి హాయిగా
జోలీ గా జాలి చేయపట్టిరి
ఆకాశమా నా పై నీకెందుకు
కోపం
పిలవని చుట్టంలా వచ్చావు
ఉన్నదంతా నీళ్లపాలు చేసావా
గంగ పుష్కారాలకు రాలేను
అనుకున్నవా
నా పంటను పుష్కరకాలం
సహాయం చేసే నాకు
వ్యయం మిగిల్చావు
ఆరు నెలల నా కష్టాన్ని
వడగండ్ల వానతో
ఒక రాత్రి నెలపాలు
చేసి నీళ్ళలో పారించి
బతుకు అమావాస్య చేసావు
వర్షం పడ్డ దుప్పట్లో దూరి
వర్షం వేరుసెనెగె కాయలు తింటూ
వేడి వేడి బజ్జిలు తింటే
నేను నీకేం పగ చేసాను
నన్ను నిద్రపట్టనివ్వక
గుండె దడతో పంటను
కాపాడుకోలేక మౌనంగా
నా కళ్ళు కారుతూనే ఉన్నాయి
రేపటి అప్పులు ఎలా తీర్చాలి
సానుభూతులు చూపే వారే
తప్ప నా వ్యధను పంచుకొనే వారు ఎవరు
పోటీ పోటీ పాడి మేము ఇది చేసాం చేస్తాం అనే వాగ్దానా
వడగండ్లతో నా మతి తప్ప
నా భ్రమ నా భ్రమ
అనే నిట్టూర్పు తప్ప నాకు
ఏమి మిగిలింది.
   ఉమాశేషారావు వైద్య
    లెక్చరర్
    దోమకొండ

0/Post a Comment/Comments