అంబేద్కర్.. లోడె రాములు

అంబేద్కర్.. లోడె రాములు

రచన.. లోడె రాములు 
చరవాణి..7382804913
శీర్షిక..*భాగ్యవిధాత..*
****************************
ఆయన చూపుడువేలు దేశానికి దిక్చూచి
ఆ నిలువెత్తు రూపమే ఆత్మ గౌరవానికి ప్రతిరూపం
ఆయన చేతిలోని రాజ్యాంగమే
మన తలరాతల్ని మార్చిన సజీవ గ్రంధం
ఆ చూపు భవిష్యత్ తరాలకు ముందుచూపు
అంటరానివాడని అసహ్యించుకున్నా
విశ్వనరుడిగా ఎదిగిన విశ్వంబరుడు
అణగారిన వర్గాలకు ఆత్మగౌరవ చిహ్నం
అంబేద్కర్ ఆలోచనలు దేశాభివృద్ధికి బాటలు
ప్రపంచమంతా అక్కున చేర్చుకున్న తర్వాతే
మనం గుర్తించడం మన ఆలోచనల లోపమే
ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ ను కొనియాడుతూ ఉంటే
అది మనకు దక్కిన గౌరవమని గర్విస్తున్నాం
అయినా ఇంకా కులమతాల పునాదుల మీద ప్రయాణం చేయడం సిగ్గుచేటు
ఆయన రాసిన రాజ్యాంగమే మనకు రక్షణకవచం
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యావత్ భారతజాతికి భాగ్యవిధాత
అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ
అక్షర నివాళులు అర్పిద్దాం..

0/Post a Comment/Comments