అంబేద్కర్ ...ఉమాశేషారావు వైద్య

అంబేద్కర్ ...ఉమాశేషారావు వైద్య

తను దహిస్తూన్నా అణగారిన వర్గాల
వెలుగును నింపిన దివిటి
మండే సూర్యుడై నిప్పు కణికై
వెలిసిన భానుడు
భూమిలో పడ్డ విత్తనం ల
మొక్కల మొల కెత్తుతూ
నమ్మిన నిజాన్ని ఎన్నో గాయాలు
అయిన
మనువాదాన్ని మంట గలిపి
బౌద్ధం ఆచరించి
అణగారిన వర్గాలు హక్కులు పొందేందుకు
ప్రపంచ రాజ్యాంగలలో మేటి
రాజ్యాంగాన్ని నిర్మించి భారత భువిలో
వెలిసిన మార్క్స్
కష్టే ఫలి అని నమ్మి ఎన్నో చదువులు
చదివి ఎవ్వరు అతనికి సాటి
చెట్టు పేరు చెప్పి కాయలు
ఆముకుంటున్న రాజకీయ పార్టీలు రచ్చమని
అతని ఆలోచనల సంపుటి రాజ్యాంగంలో ని
అక్షరాలకు నిజమైన రూపం ఇవ్వండి
కదం కదం కలిపి
మానవతకు చేయూత నిచ్చి
కులం లేని సమ సమాజం వైపు
జన్మదినాలు కాదు అతని
ఆశల రూపం వైపు

ఉమాశేషారావు వైద్య
లింగాపూర్,కామారెడ్డిజిల్లా
9440408080

0/Post a Comment/Comments