*సమగ్ర స్వరూప గ్రంథమే మన ఆదిలాబాదు దర్పణం - రచయిత రాథోడ్ శ్రావణ్*
భారత దేశంలో తెలంగాణ 29వ రాష్ట్రం 02 జూన్ 2014 న అధికారికంగా ఏర్పడింది.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు వారి ప్రయోజనాలు, పరిపాలన సౌలభ్యం కొరకు తెలంగాణలో ఉన్న పది జిల్లాలను మొత్తం 33 జిల్లాలుగా విభజించి, 73 రెవెన్యూ డివిజన్లు, 594 మండలాలను కూడా విభజించి పునర్ వ్యవస్థీకరించింది.ప్రభుత్వం జిల్లాలో ఉన్న భౌగోళిక స్వరూపం, విశిష్టత, ప్రత్యేకత, పోరాటయోధులు, జాతరలు, దేవాలయాలను దృష్టిలో ఉంచుకొని వాటి పేర్లతో కొత్త జిల్లాలకు నామకరణం చేసింది. ఈ విధంగా ఏర్పడిన జిల్లాలకు సంబంధించి జిల్లాకో పుస్తక రూపంలో జిల్లా సమగ్ర చరిత్ర ఉండాలనే ఉద్దేశ్యంతో *జిల్లా సమగ్ర స్వరూపం* అనే శీర్షికతో ఒక గ్రంథం వెలువరించాలని *తెలంగాణ సారస్వత పరిషత్తు* నిర్ణయించింది. వారు ఆదిలాబాదు జిల్లా మీద మంచి పట్టు, విస్తృతమైన సమాచార నైపుణ్యం, నాణ్యమైన విషయాలు సేకరించి పుస్తకంలో పోందుపరిచే విధంగా సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు గల *కథా రచయిత డా.మన్నే ఏలియా* గారిని
ఆదిలాబాదు జిల్లా కన్వీనర్ గా, సుమనస్పతి
రెడ్డి, వసంత్ రావు దేశ్ పాండే, బి. మురళీధర్, సామల రాజవర్ధన్, డా.ఉదారి నారాయణ, ఎం.మధుసూదనరావు, ఉట్నూరు సాహితీ వేదిక అధ్యక్షులు కవన కోకిల జాదవ్ బంకట్ లాల్ మొదలగు రచయితలను జిల్లా కోర్ కమిటీలో సభ్యులుగా
తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాదు అధ్యక్షప్రధానకార్యదర్శులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, డా. జుర్రు.చెన్నయ్య గార్లు నియమించారు.జిల్లా సారస్వత పరిషత్తు కన్వీనర్ సారథ్యంలో జిల్లాకు చెందిన మొత్తం 23 మంది వ్యాసకర్తలు 44 వ్యాసాలతో కూడిన 355 పేజీల గ్రాంథాన్ని 11 డిసెంబర్ 2022 న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ శాసన సభ సభ్యులు జోగు రామన్న, తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య, జిల్లా కన్వీనర్ డా. మన్నె ఏలియా చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు, సాహితీ అభిమానులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ పుస్తకంలో ఆదిలాబాదు జిల్లా భౌగోళిక స్వరూపం-చరిత్ర, విశ్వవ్యాప్తమైన ఆదిలాబాద్ ఆకాశవాణి- పోరాటాల ఖిల్లా.. ఆదిలాబాద్ జిల్లా-అంశం మీద కట్టా లెనిన్, గోండు రాజుల పరిపాలన, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థలు- అంశం మీద డా.తొడసం చందు, లంబాడీ గిరిజనుల చరిత్ర-సంస్కృతి పైన రాథోడ్ శ్రావణ్, గోండు రిగిజనుల సంస్కృతి- ఆర్.సంగీత, ఆదివాసీ అస్తిత్వ కేతనం దండారి పండుగ- సుమనస్పతి రెడ్డి, తాంసి గ్రామం-చారిత్రాత్మకం, పద్యకవులు,
నేరెళ్ళ రంగాచార్య, బహుభాషా -సంస్కృతి- వసంత్ రావు దేశ్ పాండే, ఆనాటి ఆదిలాబాదు, సాహితీ శిఖరం, ఉర్దూ సాహిత్యం-
సామల రాజవర్ధన్, ఎడ్లాపురం- ఎడ్ల అంగడి, జిల్లా పండుగలు- మంగారపు రమేశ్, అంతరించి పోతున్న ఆదిలాబాద్ పంటల సంస్కృతి, సాంస్కృతిక జీవనంలో కుండ, రంజన్ల ప్రత్యేకత, మా పల్లె పండుగ పొలాల- ఆదివాసుల రగల్ జెండా పోరాటం ఇంద్రవెల్లి- బి.వేణుగోపాల్ రెడ్డి, ప్రాచీన దేవాలయాలు, జాతర, మఠాలు- ఆయుర్వేద వైద్యులు-
చిందం ఆశన్న , పర్ ధాన్ కుల పంచాయతీ-పర్ ధానుల -గోండి సంస్కృతి-
డా.మెస్రం మనోహర్,వచన కవిత్వం, నవలా సాహిత్యం,తత్వకవులు- డా. ఉదారి నారాయణ,కథా సాహిత్యం, శాస్త్రీయ,జానపద సంగీతకారులు, డా. మన్నె ఏలియా, సాహితీ శిఖరం, ఆదిలాబాదు ఉర్దూ సాహిత్యం, విద్య సంస్థలు- సామల రాజవర్ధన్, జానపద కళలు-తాక్సెండి చరణ్ దాస్, రంగస్థల, నృత్య సంగీత కళలు కళాకారులు, బాలకేంద్రం- కంచనవల్లి రత్నాకర్, జిల్లా అభివృద్ధికి పాటుపడిన నాయకులు, వ్యవసాయం-తీరుతెన్నులు-ఇంజినీర్లు,కళాశ్రమం- బి.మురళిధర్, కారాడవుల్లో కాంతి రేఖలు-ఆర్ సత్యనారాయణ,ఆ.. అంటే ఆదిలాబాద్ -అద్దేపల్లి నరసింహ రావు, జిల్లా పరిశోధకులు -డా. కొప్పుల మహేందర్ ,పాడి పరిశ్రమ - మధుసూదనరావు,జీవ వైవిధ్య భరితమైన అడవులు -బాలసాని నారాయణ గౌడ్ మొదలగు రచయితలు నైసర్గిక స్వరూపం, భౌగోళిక సరిహద్దులు, జిల్లా ప్రాచీన ఆధునిక, చరిత్ర సంస్కృతి, పురావస్తు కట్టడాలు, పద్యకవులు, వచన కవిత్వం, కథా సాహిత్యం, నవలా సాహిత్యం, సాహితీ మూర్తుల పరిచయం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా. సామల సదాశివ మాష్టారు,
ఉర్దూ సాహిత్యం, తత్వకవులు, జానపద కళలు, కళాశ్రమం రంగస్థల, నృత్య, ఆర్కెస్ట్రా కళాకారులు, బభ్రువాహాన నాటకం, శాస్త్రీయ జానపద, సంగీతకారులు, బాలకేంద్రం, రాజకీయ నాయకులు, కవులు, రచయితలు, జిల్లా అక్షరాస్యత, విలేకరి జిల్లా భౌగోళిక స్వరూపం, నియోజకవర్గాలు, మండలాలు, విద్యారంగం, పరిశోధకులు, పరిశ్రమలు, ఆదిలాబాద్ ఆకాశవాణి, వ్యవసాయం,పరిశ్రమ, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థలు ( ఐటిడిఎ) విద్యాసంస్థలు, అక్షర కళాయాత్ర, అడవులు, ఇంజనీర్లు,వైద్యులు, నదులు, సుందర జలపాతాలు, పర్యాటక ప్రదేశాలు,దేవాలయాలు, పండుగలు, జాతరలు,ఎడ్ల అంగళ్ళు,పోరాట యోధులు, విలేకరి విషాదం ఇలా ఈ ప్రాంతాన్ని పాలించిన బీజాపూర్ సుల్తాన్ మొహ్మద్ ఆదిల్షా మొదలు కొని కొత్త జిల్లా ఆవిర్భావం వరకు ఎన్నో వివరాల సంకలనంగా రూపుదిద్దుకున్నదే ఆదిలాబాదు జిల్లా సమగ్ర స్వరూపం. దాదాపు 80 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలంగాణ సారస్వత పరిషత్తు ఎంతో శ్రమకోర్చి ఈ గ్రంథాన్ని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ముద్రించడం సంతోషం.
*వెల:రూ.350*
*ప్రతులకు:*
తెలంగాణ సారస్వత పరిషత్తు
తిలక్ రోడ్ ఆబిడ్స్
హైదరాబాద్-500001
ఫోన్:- 040-24753724
*సమీక్షకులు, (ఉపన్యాసకులు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంద్రవెల్లి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ)*
*రాథోడ్ శ్రావణ్*
ఉట్నూరు ఆదిలాబాదు జిల్లా
9491467715