"కొత్త చిగురు" పుస్తక సమీక్ష ,
సమీక్షలు :-రాథోడ్ శ్రావణ్ ఉట్నూరు ఆదిలాబాదు జిల్లా
___________________________
తెలుగు సాహిత్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కవితలు,బాల గేయాలు, కథలు, పద్యాలు రాస్తూ, బాలల కోసం అహర్నిశలు శ్రమిస్తూ, అనేక సంకలనాలు వెలువరించిన బాలబంధు, బాల సాహితీవేత్త గౌ ll శ్రీ,, గద్వాల సోమన్న
అంటే గుర్తుతెలియని వారు ఉండరు.
ముఖ్యంగా విద్యార్థుల కోసమే అనేక రచనలు చేశారు.
అందులో పసిడి హృదయాలు తొలి రచన కావడం విశేషం. బాలసాహిత్యంలో ఒంపు సొంపు తెలుగు పదాలతో రమణీయమైన గేయాలు, మెరుపులు కలిగిన ముత్యాల హార ప్రక్రియలో ఏకంగా మూడు పుస్తకాలు రాశారు. ఇప్పటి వరకు ఇరవై ఐదు పుస్తకాలు ఆవిష్కరించి "కొత్త చిగురు" బాల గేయాలతో పుస్తకాల సంఖ్య ఇరవై ఏడుకు చేరడం సంతోషం
వృత్తి రీత్యా గణిత సహ ఉపాధ్యాయుడైన గద్వాల సోమన్న తెలుగు సాహితీ రంగంలో అనేక సాహిత్య అవార్డులు, రివార్డులు పొంది ఔరా! అనిపించుకున్నాడు. అతని గేయాలు ఆత్యంత రసానుభూతి, ఆనందానుభూతిని కలిగి, అందమైన అంత్యప్రాసలతో వినూత్నమైన ఆలోచనతో సృజనాత్మక గేయాలను మెరుపులు దిద్దడం ఆయన సొంతం. అనురాగమయి అమ్మ, గురు దేవులు, శ్రామికులు,మధుమాసం ధరహాసం, ఇంటి దీపము ఇల్లాలు, సంక్రాంతి ముగ్గులు, రైతే రాజు, బాలలు, పోరాటం, నమ్మకం ఇలా మొత్తం నలభై ఐదు అంశాలను తీసుకొని సంకలనం తీసుకురావడం ఆనందదాయకం. ఈ సంకలనం లోని రెండు బాల గేయాలను పరిశీలిద్దాం.
పలక బలపం పట్టుకొని
అక్షరాలు రాసేస్తాం
చదువు పై ధ్యాస పెట్టుకొని
విజ్ఞానం ఆర్జిస్తాం
అందరిని కలుపుకొని
సమైక్యత సాధిస్తాం
వ్యర్థమైనవి వదులుకొని
అర్థం కల్గి జీవిస్తాం
ఈ గేయ సంపుటిలో అనేక సమకాలీన, సామాజిక అంశాలను ఉటంకించారు. నిరంతర అధ్యయనశీలిగా నిత్యనూతన విద్యార్థిగా తనను తాను మలుచుకుంటూ ముందు ముందు వేడి వేడి గారెలు లా గేయాలు, బూరెలు లా కవితలు, రసగుల్లాలతో కూడిన ఒక మంచి పుస్తకాన్ని అందించాలని కోరుకుంటూ,
ఇలా అర్థభరితమైన భావాలతొ కూడిన, చక్కని పదజాలంతో ఐదు దశాబ్దాల వయస్సులో కవి తెలుగు సాహిత్యంలో అత్యంత వేగంగా ఉరకలేస్తు ఇరువై ఏడు పరుగులు తీసి(పుస్తకాలు రాసి) వారెవ్వా! అనిపించినా గద్వాల సోమన్న ఎమ్మిగనూరు కర్నూల్ జిల్లా గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
వెల: 80/-
ప్రతులకు
గద్వాల సోమన్న
ఇం నెం1/1583
ఎమ్మిగనూరు కర్నూల్ జిల్లా
9966414580
సమీక్షకులు:-
శ్రావణ్ రాథోడ్
కవి, రచయిత, ఉపన్యాసకులు , పూర్వ అధ్యక్షులు ఉట్నూర్ సాహితీ వేదిక ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా.9491467715.*