లఘు కవిత ప్రక్రియ ముత్యాల హారం రూపకర్త.రాథోడ్ శ్రావణ్

లఘు కవిత ప్రక్రియ ముత్యాల హారం రూపకర్త.రాథోడ్ శ్రావణ్

 ప్రక్రియ-ముత్యాలహారం :-
_____________________________

భారతీయ ప్రాచీన కావ్యశాస్త్రం ప్రకారం  కావ్యం అనగా శబ్దార్థసహితమైనదే కావ్యం అని ఆచార్య భామహ అన్నారు.
రమణీయార్థ ప్రతిపాదక శబ్దమే కావ్వం అని ఆచార్య  జగన్నాథ్ పండితులు అన్నారు, నేటి ఆధునిక కాలంలో కావ్యశాస్త్రంలో లఘు కవితా ప్రక్రియలకు ఆదరణ‌ పెరుగుతుంది. ప్రక్రియ నియమాలను పాటిస్తూ  వాట్సాప్ సముహం ద్వారా చిన్న చిన్న కవితలు రాయడంలో సామాజిక మాధ్యమాలు వేదికగా నిలుస్తోంది.ఇటీవల కాలంలో  నాలుగు పాదాలు కలిగి, చక్కటి అందమైన అంత్యానుప్రాసలతో  ఆకర్షణీయంగా మాత్రానియమాలను పాటిస్తూ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్న ప్రక్రియ "ముత్యాలహారం" ఈ ప్రక్రియను ఆదిలాబాద్ జిల్లా మారుమూల ఏజేన్సి ప్రాంతమైన నార్నూర్ మండలంలోని సోనాపూర్ తండాకు చెందిన కవి రచయిత ఉపన్యాసకులు,శ్రీ రాథోడ్ శ్రావణ్ గారు రూపొందించారు.వీరు ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంద్రవెల్లి యందు హిందీ ఉపన్యాసకులుగా విధులను నిర్వహిస్తున్నారు.ఉన్నత విద్యావంతుడైన శ్రీ రాథోడ్ శ్రావణ్ ఉట్నూర్ సాహితీ వేదికలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. వీరు తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉట్నూర్ సాహితీ వేదిక వ్వవస్తాపక అధ్యక్షులు అయిన గౌ శ్రీ గోపగాని రవీందర్ గారు తెలుగు సాహిత్యానికి చేస్తున్నా కృషిని ఆకర్షితులై  తెలుగు భాష పై ఆసక్తిని అభిరుచిని పెంచి ప్రాస పదాలపై పట్టు సాధించి తెలుగు సాహిత్యంలో నూతన లఘు వచన కవిత ప్రక్రియ "ముత్యాలహారం" రూపొందించారు. ముఖ్యంగా పాఠశాల, కళాశాలలో విద్యార్ధులు మాతృభాషను మర్చిపోతున్నారని తెలుగు భాష మాట్లాడేటప్పుడు ఆంగ్లం, హిందీ, మరాఠీ,  పదాలు ప్రయోగించడం కలవరపెట్టిందని, హోళి పండుగాన కొలాటంతో జాజిరి జాజిరి, పాట పాడిన చిన్నారుల పాటలోని అంత్యానుప్రాసకు ఆకర్షితులై ఆ తపన నుండే  ముత్యాల హార ప్రక్రియకు రూపకల్పన జరిగింది అని అన్నారు.  ప్రస్తుతం వాట్సాప్ వేదికగా ఒక ప్రత్యేక సమూహంను ఏర్పరచి,భాష అభిమానులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, కవులకు, రచయితలకు, సూచనలు సలహాల ద్వారా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా శతాధిక ముత్యాల హారాలు లిఖించిన కవులకు, సాహితీ ముత్యాల హారం పురస్కారం, మరియు సాహస్రాధిక ముత్యాల హారాలు లిఖించిన కవులకు "సాహస్ర రత్న ముత్యాలహార" పురస్కారమును ఉట్నూర్ సాహితీ వేదిక ద్వారా ఆన్లైన్లో ప్రశంసాపత్రాలను, పురస్కారాలను అందిస్తూ ప్రోత్సాహిస్తున్నారు. వీరికి పూర్వ అధ్యక్షులు, శ్రీ, కొండగుర్ల లక్ష్మయ్య గారు,కట్ట లక్ష్మణాచారి గారు, ప్రస్తుత‌ అధ్యక్షులు కవన కోకిల శ్రీ జాదవ్ బంకట్ లాల్ గారు, ప్రధాన కార్యదర్శి  జ్ఞానేశ్వర శతకకర్త. శ్రీ ,ముంజం జ్ఞానేశ్వర్ గారు, ప్రచార కార్యదర్శి శ్రీ ఆత్రం మోతీరామ్ గారు సమస్త ఉసావే పరివారం సహకరిస్తూన్నారు.
ముత్యాలహారం ప్రక్రియ తేది 18 మార్చి నెల 2021 లో  ప్రారంభమై ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి శతాధిక కవులు ముత్యాల హారంను రమణియంగా అల్లుతుండగా వారిలో 40 మంది కవులు శతాధిక ముత్యాల హారాలు రాయడం, ఐదుగురు కవులు సాహస్రాధిక ముత్యాల హారాలు రాయడం, 
ప్రముఖ కవి,రచయిత,గణిత ఉపాధ్యాయుడు,బాలబంధు, బాలసాహీతి వేత్త, శ్రీ గద్వాల సోమన్న గారు రెండువేల పై చిలుకలు ముత్యాల హారాలు లిఖించి‌
 *బాలల ముత్యాల హారాలు* అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
కవి గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి నాగర్ కర్నూల్ గారు వెయ్యి పైన ముత్యాల హారాలు లిఖించారు. శ్రీమతి డాక్టర్ మరుదాడు అహల్యాదేవి హైదరాబాద్ గారు వెయ్యి పైన,శ్రీమతి చైతన్య భారతి పోతుల హైదరాబాద్ గారు ఎనిమిది వందలు, మక్కువ అరుణకుమారి ఎనిమిది వందలు  ఇలా ఒక్కొక్క కవి వర్యులు రెండు,  మూడు, వందల వరకు రాయడం గమనార్హం. ఈ ప్రక్రియలో వెలువడిన తొలి సంకలనం
*హారితహారంకు ముత్యాల హారం* 
 రూపకర్త సౌజన్యంతో సంకలనం గావించారు. అతి త్వరలో ఆవిష్కరణ కానున్న పుస్తకాలు
 *1.రాథోడ్ ముత్యాల హారాలు,2. ముత్యాల హారాలు జీవిత సత్యాలు, మరియు కవి జక్కని వారి,3 చక్కని ముత్యాల హారాలు* 
ముద్రణలో ఉన్నాయి.
 ఇక అత్యంత ఆకర్షణీయమైన ప్రక్రియ "ముత్యాలహారం" నియమాలను ఒకసారి పరిశీలిద్దాం.

ముత్యాల హారం ప్రక్రియ నియమాలు:-
---------------------------------------------------------
1). ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి.
2). ప్రతి పాదంలో 10 నుండి 12  మాత్రలు  మాత్రమే ఉండాలి.
3). 1,2,3,4 పాదాలలో చివరి అంత్యనుప్రాస ఉండాలి.
4). ఒకటవ పాదంలో ఎన్ని మాత్రలు వచ్చునో 2,3,4 పాదాల్లో కుడా 10 నుండి 12 లోపు మాత్రలు మాత్రమే ఉండాలి.
5). నాలుగు పాదాలు కలిపి చదివినప్పుడు భావాత్మకంగా ఉండాలి. లఘువు(1) ను ఒక మాత్రంగా, గురువు (2) ను రెండు మాత్రలుగా లెక్కిస్తారు.
పాఠకులకు మరింత అవగాహన కోసం రూపకర్త  రాసిన కోన్ని ముత్యాల హారాలు.

తెలుగు తల్లి బిడ్డలం
తేనెలూరే తెట్టలం
అడవి తల్లి బిడ్డలం
ప్రకృతి మాత పుత్రులం

మేము గిరి పుత్రులం
కపటం లేని తారాలం
ఉట్నూరు వాసులం
సాహిత్యపు రాసులం

బడికి వెళ్ళే బాలలం
వానలో తడిచే కూనలం 
ఎండాలొ ఆడే కాంతులం 
మట్టిలొ దొరలె పిట్టలం

అద్భుతంగా ఉన్నాయి కదు! మరి మీరు కూడా ప్రయత్నం చేయండి.

 రాథోడ్ శ్రావణ్
ముత్యాల హారం రూపకర్త. పూర్వ అధ్యక్షులు ఉట్నూర్ సాహితీ వేదిక,ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లా.తెలంగాణ
చరవాణి సంఖ్య:-9398761117.

0/Post a Comment/Comments