75 వసంతాల స్వతంత్ర భారతం వజ్రోత్సవ వేడుకల సంధర్భంగా అక్టోబర్ 2న గాంధీ గారి జయంతి సంధర్భంగా విశ్వకలం సాహితీ వేదిక వారు "బాపూజీ వజ్ర సంకల్పానికి వజ్రోత్సవం" అనే చక్కటి కవితా సంకలనం
శ్రీ నాగెల్లి సురేష్ గారి సంపాదకత్వంలో వెలువరించారు. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల కవులనుండి కవితలను ఆహ్వానించారు. ఇందులో బాగంగా
అమడబాకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న యం. ప్రవల్లిక దీనికోసం రాసిన కవిత అర్హత పొంది సంకలనంలో ముద్రించబడింది. ఈ సంకలనంలో రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ కవుల కవితలు ముద్రించబడ్డాయి. అందులో అమడబాకుల పాఠశాల విద్యార్థి స్థానం పొందినందున, రెండు కవిత సంకలన పుస్తకాలు పంపించారు. దీనిని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి
యన్. విద్యావతమ్మగారు, తెలుగు ఉపాధ్యాయులు శ్రీ సి. శేఖర్ గారు ఉపాద్యాయ బృందం ఆవిష్కరించారు. విద్యార్థినికి, తెలుగు ఉపాధ్యాయునికి అభినందనలు తెలియజేశారు.