ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డిచే కవి గద్వాల సోమన్నకు సన్మానం
----------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని ,హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయునిగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్నను ,ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి,ఉపాధ్యాయులు సాహిత్యంలో వారి విశిష్ట సేవలకు ఘనంగా సన్మానించారు.అనంతరం కవి గద్వాల సోమన్న రచించిన 30 పుస్తకాలు నరసింహారెడ్డి గారికి బహుకరించి,సత్కరించారు.ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ శ్రీనివాసులు, ఉపాధ్యాయులు జయరాజు, లక్ష్మీనారాయణ, నారాయణ నాయక్, పి.శ్రీనివాసులు, తాయప్ప,పాండురంగ, రామకృష్ణుడు, వినోద్,ఆంజనేయులు, బాబయ్య,ప్రసన్నరాజు, జనార్దన్, అడివన్న,ఈరన్న,పౌలన్న,తులసీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.