నేడే వివేకానందుని జయంతి
నేటి తరానికి అతని బోధనలు అందించాలి! కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య.
ఫలితంపై ఎంత శ్రద్ధచూపిస్తారో
దాన్ని పొందేపద్దతుల్లోనూ ఆ0 తే అంతే శ్రద్ధ పాటించాలి.మీరు
ఎలాఆలోచిస్తేఅలాగేతయారుఅవుతారు.బలహీనులుభావిస్తే బలహినూలే అవుతారుశక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు.
వేద పురుషుల హృదయాన్ని, మహర్షుల నైతికతను వాస్తవిక దృక్పథంతో అర్థంచేసుకొనిఆచ రణాత్మకవిధానాలురూపొందించినవాడు, తానుగా ఆచరించి చూపినవాడు, మన సంస్కృతి సాంప్రదాయాలనుఖండాంతరాలు దాటించినవాడు,భారతీయ స్త్రీల విశిష్టతను చాటి చెప్పిన వాడు, విశ్వమానవాళినవశకం వైపుపరుసలుతీయాలనికోరుకున్న వాడు వివేకానందుడు.
ప్రపంచ మత సమ్మేళ నంలో భారతదేశానికి హిందూ మతా నికి ప్రాతి నిధ్యంవహిస్తూ1893 సెప్టెంబర్11నచికాగోలోప్రపంచ ప్రపంచ వ్యాప్తంగాపలుమతాల సమ్మేళనంలోప్రసంగిస్తూ ప్రియ మైనఅమెరికాసోదర సోదరీమణులారా!"అనిసంబోధిస్తూప్రారంభించడంతోనేశ్రోతలనుఆకట్టుకున్నారు.సాధారణంగాలేడిస్‌అండ్‌జెంటిల్‌మెన్"అన్నసంబోధనకుఅలవాటుపడ్డవారినిఈపిలుపులోనిఆత్మీయత ఆకర్షించింది.ఆయన సందేశానికి, వాక్పటిమకు, నిజాయితీతోకూడినసంభాషణకుఅక్కడిప్రతినిధులుఆకర్షితులయ్యారు. అమెరికన్ పత్రికలు సైతం వివేకానందుని వ్యక్తిత్వం సందేశాన్నిప్రశంసించాయి.ఎంతోమందిఅతనికిశిష్యులయ్యారు.పాశ్చాత్యదేశాలలోఅడుగుపెట్టిన మొదటిహిందూసన్యాసి వివేకానందుడే.మన సంస్కృతి మహిళకుఇచ్చినస్థానం,గౌరవం గురించిమాట్లాడుతూనేటిభారతీయమహిళ ఎదుర్కొంటున్న ప్రధానసమస్యవిద్యాలేకపోవడంఏసమస్యనైనవిద్యమాత్రమే పరిష్కరిస్తుంది. సమాజం మహిళ విద్యకోసం గట్టి ప్రయ త్నాలు చేయకపోవటం విచార కరమని, వేద కాలంలోనే మహి ళలు విద్యను అభ్యసిం చారని, గార్గె,హైత్రేయివంటిమహిళామణులు..పీఠాలనుఅలంకరించని అంటూచికాగోసభలోవివేకానందుడుచెప్పాడు.తనదేశం అలా 0టిస్థితికిరావాలని,చరిత్రపునరావృతమవుతుందనేఆకాంక్షని వ్యక్తంచేశారు.భారతీయమహిళలు ఆదర్శ మహిళలనివారిని గురించిప్రపంచంఎంతోతెలుసుకోవలసిఉందనిఅనేవారు.భారతదేశంలోస్త్రీత్వంఅంటేమాతృత్వమే. నిస్వార్ధత, త్యాగశీలత సహనము ఈ గుణాలతో విల సిల్లేస్త్రీ మూర్తియేమాతృమూర్తి అనేవారు.స్త్రీపురుషులసమానత్వానికి కృషి చేసిన ఆధునిక నాయకుడు. సమాజాభివృద్ధికి స్త్రీ పురుషులు బండికి ఉన్న రే 0డుచక్రాలవంటివారనిసమాజం అనే పక్షి ఎగరాలంటేరెండు రెక్కలుండాలని ఒకరెక్కతో ఎగ రలేదనివివేకానందచెప్పేవారు.భారతీయతత్వవేత్త,గొప్పమేధావిస్వామివివేకానందసందేశాలుసూటిగాయువతహృదయాన్నితాకుతాయి.యువశక్తితలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదని ఆయన యువ తకుఇచ్చినసందేశాల్లోఇదోమచ్చుతునక.లేవండి..మేల్కోండి గమ్యంచేరేవరకుఎక్కడనిలవకండి.ఎప్పుడూ జాగృతంగానే ఉండండి. బలమే జీవితం,బల హీనతేమరణం.ఇనుపకండరాలు,ఉక్కునరాలు,వజ్రసంకల్పం మనసులో ఉన్న యువత ఈ దేశానికికావాలనివివేకానందుడు వికోరుకునేవాడు.ఆధునిక యువతపైనే తనకు విశ్వాసం ఉందని, తను నిర్మించిన ఆదర్శాన్ని దేశమంతా వ్యాప్తి చేసేది వారేనని, అలాంటి యువత ముందుబలిష్టంగాను, జీవ సంపన్నులుగాను, ఆత్మ విశ్వాసులుగానుఋజువర్తనులుగాను మారాలని, అలాంటి యువత వందమంది ఉన్నా చాలనిఈప్రపంచాన్నేమార్చవచ్చని యువశక్తిని స్వామి వివేకానంద కొనియాడారు.
జీవితం మిథ్యఅన్నఆలోచనను పక్కన పడేసి పని చేయడం మొదలు పెట్టాలంటాడు. నూరేళ్ల పుణ్యకాలాన్ని గాలికి, ధూళికి, దేవుడికి, దయ్యానికి వదిలిస్తేమనంగాబతికేదెప్పుడు, పనిచేసేదెప్పుడు, పుట్టినందుకు సార్ధకత సాధించేదెప్పుడు అంటాడు వివేకానంద.దేవుడుపరీరక్షిస్తున్నాడు, కాలం కలిసి రావడం లేదు,అంతానాతలరాతఅంటూకష్టాన్నితెచ్చుకుంటూకూచోడాన్నిఆయనతీవ్రంగావ్యతిరేకిస్తాడు.నీజీవితానికినువ్వేకర్తవు, నీజీవితా నికి సంబంధించిన బాధ్యతఅం తానీదే, నీ విధికి నువ్వే కర్తవు. తలరాత అంటూ వేరేలేదు.నీతలరాతనునువ్వేరాసుకోవాలి.ధాతవు,విధాతవుఅన్ననువ్వేఅంటాడు.మనిషి మనిషిగా చక్కగాచల్లగాబతకా లంటే సహనం, శాంతం కావాలి ఒక్కక్షణంసహనంగాఉండగలిగితేఅనేకప్రమాదాలుతప్పుతాయిక్షణకాలంఅసహనంతోఅనర్థాలు జరిగిపోతాయిఅంటాడు. మనిషి రాణించడానికి విజ్ఞానం వివేకంఎలా అవసరమోశాంతం సహనం కూడా అంతే అవసరం అంటాడు.లోకంలోచాలామంది తోచిందనో, తోచలేదనో ఎదుటి వారితోమాట్లాడుతూఉంటారు కొన్నిసార్లువాళ్లపనులుచెడగొట్టేస్తూ మాట్లాడుతారు.అయిన దానికి, కాని దానికి సలహాలు, సూచనలు అడుగు తుంటారు. అలా చేసి అందరిని ఇబ్బంది పెట్టడం కన్నా మనలో ఉన్న మనిషితో మాట్లాడండి. అద్భు తమైన సలహాలిస్తాడు. అలా చేయకపోతే జీవితంలో ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడే మధుర అవకాశాన్ని శాశ్వతంగా కోల్పో తారు అంటాడు వివేకా నంద.
కనుకపక్కవారినిసలహాలుసూచనలుఅడగటానికిముందుమిమ్మ ల్ని మీరు సంప్రదిం చండి. దాన్నే ఆత్మావలోకనంఅంటారు ఆత్మవిచారణచేశాకేమరెవరితోనైనా మాట్లాడండి.అద్భుతాలు చేయడానికిఇదొకమహత్తరమైనచిట్కా.వివేకానందుడుచెప్పినసూచననుగౌరవిద్దాం.ఆచరిద్దాంజీవితకాలంబాగుపడుదాం
దేనికీభయపడవద్దు.భయపడిన మరుక్షణం మీరు ఎందుకూ పనికి రాకుండా పోతారు. ఈ ప్రపంచంలోదు:ఖానికిమూలకారణం భయమే. నిర్భయమే మనకుసర్వాన్నిప్రసాదించగలదు.భయరాహిత్యమేఅనిర్వచనీయమైనమనశ్శాంతికిమార్గం.
ఉమాశేషారావు వైద్య
9440408080