'సోమన్న మధురిమలు' పుస్తకావిష్కరణ
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న రచించిన 28వ, కొత్త పుస్తకం 'సోమన్న మధురిమలు' బాలగేయాల సంపుటి మాజీ యం.పి,మాజీ కేంద్ర రైల్వే మంత్రి శ్రీ కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి గారి చేతుల మీద,వారి స్వగృహంలో,జనవరి1,2023న కర్నూలులో ఘనంగా ఆవిష్కరించారు.నిఖిలేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ అధ్యక్షులు శ్రీ మద్దులేటి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది.అనంతరం అనతి కాలంలో 28పుస్తకాలు ప్రచురించడమే కాకుండా,బాలసాహిత్యంలో విశిష్ట సేవలకు గానూ గద్వాల సోమన్నను ఘనంగా సన్మానించారు. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుకు ఆదరణ తరుగుతున్న తరుణంలో సోమన్న లాంటి కవుల పాత్ర అమోఘమని,మాతృభాష పరిరక్షణ అందరి బాధ్యత అని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో శ్రేయోభిలాషులు మరియు పుర ప్రముఖులు పాల్గొన్నారు.