ఆనందించడం మరిచాం

ఆనందించడం మరిచాం

ఆనందించడం మరిచాం

అందమైన శుభోదయం
ప్రకృతి ప్రాణం పోసుకుంటున్న వేళ 
చూసి ఆనందించడం మరిచాం
ఫోటో తీసి స్టాటస్ పెట్టడం చేశాము 

గలగల పారే నది జలాలలో 
జలకాలాడడం మరిచాం
ఫోజు లివ్వడం చేశాము 

పువ్వుల అందం, నవ్వుల బంధం
అమ్మా నాన్నల పలకరింపులు
ఆలోచించడం మరిచాం
షేర్ చాట్ లు చేశాము 

అన్నం తిన్నడం 
వేళకి నిద్ర పోవడం 
మాటామంతీ మరిచాం
వాట్సాప్ లో జీవిస్తున్నాం 

సోషల్ మీడియా జీవితాలలో 
యూట్యూబ్ ల వీక్షణలతో
ఎందరో స్టార్ లు పుట్టుకొచ్చిన
జీవిత కాలం వృథయే సూమా!
వాటిని చూసి సాధించేది సున్నా 

కదిలేది కదిలించేది 
భవిష్యత్తును నిర్మించేది
నీలోని శక్తి ని నమ్మి 
పని పై శ్రద్ధ తో ముందుకు సాగు

Velmajala Narsimha
Vill. Duppelli.
Mob. 9867839147


వెల్మజాల నర్సింహ ✍🏻

0/Post a Comment/Comments