ఎలుగుబంటి (బాలగేయం)-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు.

ఎలుగుబంటి (బాలగేయం)-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు.

ఎలుగుబంటి (బాలగేయం)
----------------------------------------
ఎలుగుబంటి క్రూరమృగం
మారు పేరు భల్లూకం
వెంట్రుకలు నలుపు నలుపు
దాని చూడ భయం భయం

అడవిలోన జీవించు
రాత్రిపూట సంచరించు
గోళ్ళతో రక్కిందా!
రక్తమెంతో స్రవించు

ఘ్రాణ శక్తి కల్గిండును
చలాకీగా పరుగెత్తును
నీటిలో ఈదగలదు
చెట్లపైకి ఎక్కగలదు

ఒంటరిగా కన్పించు
ప్రమాదంలో సాహసించు
గుహలు,గోతులు  వాటి
వశించే స్థావరాలు

-గద్వాల సోమన్న,
ఎమ్మిగనూరు.

0/Post a Comment/Comments